Mothevari Love Story: భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో (Zee5) ఇప్పుడు ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ (Mothevari Love Story) అనే వెరైటీ టైటిల్‌తో రూపొందిన ఈ సిరీస్.. ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో సహజంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతుందని, విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్‌లో అనేక ట్విస్టులు ఉండబోతోన్నాయని మేకర్స్ చెబుతున్నారు. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామాగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లుగా తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఈవెంట్లో మేకర్స్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..
జూలై 9న హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్, టైటిల్‌ని హీరో ఆనంద్ దేవరకొండ ఆవిష్కరించారు. లంబాడిపల్లి అనే గ్రామంలోని ఇద్దరు సోదరులు, చనిపోయిన తండ్రి ఓ మహిళకు రాసిచ్చిన ఐదు ఎకరాల భూమి, రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత (వర్షిణి రెడ్డి జున్నుతుల), అనుమవ్వ మనవడు పార్షి (అనిల్ జీలా) జంట, ఈ భూ వివాదం, కుటుంబ గర్వం, వారసత్వం మధ్య సాగే ఈ సిరీస్ ఆద్యంతం అందరినీ అలరించేలా ఉంటుందని, ఈ ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
Also Read- Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
ఈ టైటిల్, పోస్టర్ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. నాకు చిన్న సినిమా, పెద్ద సినిమా.. చిన్న సిరీస్, పెద్ద సిరీస్ అని అనడం అసలు నచ్చదు. దేనికైనా పడే కష్టం ఒకటే. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. వాస్తవంగా నాకు ఇలాంటి వేడుకలకు రావాలంటే కాస్త భయం. కానీ, పిలిచింది అనిల్ కావడంతో వెంటనే వచ్చేశాను. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు ఎక్కువగా అక్కడి వారు మై విలేజ్ షో కంటెంట్‌ను చూసేవాళ్లు. నేను కూడా దానిని ఫాలో అయ్యేవాడిని. మధుర శ్రీధర్ నా ‘దొరసాని’ సినిమాను నిర్మించి నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఆ మూవీకి మై విలేజ్ షో కంటెంట్ చూసే నేను డైలాగ్స్, యాసను నేర్చుకున్నాను. నా జర్నీలో మై విలేజ్ షో టీం పాత్ర చాలా ఉంది. ఈ సిరీస్ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పెద్ద సక్సెస్ రావాలి. ఈ సిరీస్‌కు సీక్వెల్స్ వస్తూ, సక్సెస్ అవుతూనే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Alia Bhatt: అలియాకు బిగ్ షాక్.. రూ.77 లక్షలు స్వాహా.. ఇలా కూడా మోసపోతారా?
జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ.. కరోనా టైంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అనే సినిమా చూసి ఆశ్చర్యపోయాను. ఆ చిత్రం ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. వెంటనే ఆ మూవీ రైట్స్‌ను మేం కొనేశాం. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’తో సంగీత్ శోభన్‌కు స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌తో అనిల్ గీలాకు అలాంటే స్టార్డమ్ వస్తుందని భావిస్తున్నాం. మై విలేజ్ షో టీమ్‌తో అసోసియేట్ అవ్వడం, మధుర శ్రీధర్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. గ్రామీణ రొమాంటిక్-కామెడీగా తెరకెక్కిన ఈ సిరీస్ కచ్చితంగా అందరినీ మెప్పిస్తుందని అన్నారు. జీ5 కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ.. మట్టిలో మాణిక్యం అనే దానికి మై విలేజ్ టీం ఉదాహరణ. అనిల్‌ను ఇంత వరకు యూట్యూబ్ స్టార్‌గా చూశారు. ఇప్పుడు హీరోగా అందరినీ ఈ సిరీస్‌తో ఆకట్టుకోబోతోన్నారు. తెలంగాణ యాసతో వచ్చే వెబ్ సిరీస్ ఇదే. ప్రేమ, హాస్యంతో పాటు ఆసక్తికరమైన ట్విస్టులు ఇందులో ఉంటాయి. కూడా ఉంటాయి. ఈ సిరీస్‌కు ఇకపై ఫ్రాంచైజీలు వస్తూనే ఉంటాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీ5 వైస్ ప్రెసిడెంట్ జయంత్, అనిల్ జీలా, శివకృష్ణ, శ్రీకాంత్ శ్రీరామ్, వర్షిణి రెడ్డి, గంగవ్వం, మధుర శ్రీధర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ వంటి వారంతా ప్రసంగించారు.
A new genre in town!
Telugu #ZEE5 Original #MothevariLoveStory with local #Telangana flavour and a whole lot of fun, it looks like a fun gang is on the way to deliver another great story. #MothevariLoveStory
PREMIERES from 8th August ONLY on ZEE5.#MothevariLoveStoryonZEE5… pic.twitter.com/4WiHWCkoOP— Phani Kandukuri (@phanikandukuri1) July 9, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు