CM Revanth Reddy: వనమే మనం మనమే వనం. వనం పెంచినప్పుడే మనం క్షేమంగా ఉండడంతోపాటు అభివృద్ది వైపు నడుస్తాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. (Ranga Reddy District) రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ప్రొఫేసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని బొటానికల్ గార్డెన్స్‌లో రుద్రాక్ష మొక్క నాటిన సీఎం, వన మహోత్సవం 2025ను లాంఛనంగా ప్రారంభించారు. అటవీ శాఖ, హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తల్లులు మొక్కలు నాటితే పిల్లలను చూసుకున్నట్లే జాగ్రత్తగా సంరక్షిస్తారని పేర్కొన్నారు. అమ్మ పర్యవేక్షణలో ఏం చేసినా రక్షణ ఉంటుందని, ప్రతి తల్లి ఇంట్లో రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని, పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదుగా నాటి సంరక్షించాలని కోరారు.
Also Read: Swetcha Effect: రైతులకు పంట నష్టపరిహారం.. స్వేచ్ఛకు ప్రత్యేక కృతజ్ఞతలు
మహిళలూ.. అధికారం మీదే
మహిళలు నాయకులుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) తెచ్చిన రిజర్వేషన్ల వల్లనే వారికి అన్ని రకాలుగా అవకాశాలు కలుగుతున్నాయని, గద్వాల విజయలక్ష్మి, శ్రీలతలు మేయర్, డిఫ్యూటీ మేయర్లు అయ్యారని, సునీతా మహేందర్ రెడ్డి (Mahender Reddy) నాలుగు సార్లు జడ్పీ ఛైర్మన్ అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 153కు పెరగబోతున్నాయని, మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని అన్నారు. 51 సీట్లకు అదనంగా మరో 9 సీట్లు కలిపి మొత్తం 60 ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇచ్చి గెలుపించుకునే బాధ్యత తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. ఇల్లు నడిపిన మహిళలు రాజ్యాలను కూడా బ్రహ్మాండంగా నడుపుతారని కితాబిచ్చారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మహిళల గురించి పట్టించుకున్నవారు లేరని, ఐదేళ్లపాటు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వలేదని విమర్శించారు.
ప్రపంచంతో తెలంగాణ మహిళల పోటీ
మహిళలను అగ్రభాగాన నిలబెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా విజయవంతం అవుతుందని తనకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ప్రజా పాలనలో అన్ని కార్యక్రమాలను మహిళల కేంద్రంగానే చేపడుతున్నట్లు చెప్పారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామని, ఉపాధ్యాయుల అటెండెన్స్ బాధ్యతలను మహిళలే చూసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఒకప్పుడు సోలార్ వ్యాపారం పెట్టాలంటే అదానీల వైపు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు వెయ్కి కోట్ల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడమే కాదు, ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి ఇచ్చి వెయ్యి బస్సులకు యజమానులుగా ఉన్నారని తెలిపారు. హైటెక్ సిటీ అంటే విప్రో, మైక్రోసాఫ్ట్ లే గుర్తుకు వస్తాయని, పక్కనే వంద కోట్ల విలువ జేసే మూడున్నర ఎకరాల స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి పేరుతో అప్పగించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తులతో మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. భారత్ సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ స్థాయి ప్రతినిధులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని, మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారంతా కూడా సందర్శించి తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారని అభినందించారన్నారు.
Also Read: Artificial Intelligence: ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో కష్టాలు.. మార్ఫింగ్ వీడియోలతో మోసాలు!