Lokesh Kanagaraj
ఎంటర్‌టైన్మెంట్

Lokesh Kanagaraj: ‘లియో’కి చేసిన తప్పు చేయకూడదనే.. ‘కూలీ’ కోసం కష్టపడ్డా!

Lokesh Kanagaraj: సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) నటిస్తున్న ‘కూలీ’ (Coolie) సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కూలీ’ మూవీ కోసం తాను పడిన కష్టాన్ని పంచుకున్నారు.

Also Read – Tamannaah Bhatia: ప్రభాస్ సినిమాలో ఐటం సాంగ్‌కు ఓకే చెప్పిందా?

‘లియో’ (Leo) సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా ‘కూలీ’ కోసం గత రెండేళ్లుగా చిన్న చిన్న సరదాలకు కూడా దూరమయ్యానని తెలిపారు. కుటుంబం, స్నేహితులను సైతం కలవడానికి సమయం లేదన్నారు. నెలల తరబడి సోషల్ మీడియాకు దూరంగా ఉండి మూవీ కోసం కష్టబడ్డానన్నారు. ఈ రెండు సంవత్సరాలలో తన 36, 37 పుట్టిన రోజులు కూడా జరుపుకోలేదని అసలు వాటి గురించే మరిచిపోయానని అన్నారు. రెండు సంవత్సరాలు కేవలం ఈ సినిమా కోసమే ఆలోచన చేశానన్నారు. కథను బాగా నమ్మడంతో అందులో లీనమైపోయానన్నారు. గత సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా వాటిని మించి ఉండాలని నిరంతరం శ్రమించానన్నారు.

Also Read –Atchannaidu: ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్‌ గాలి తీసిన అచ్చెన్న..!

తమిళ ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన లోకేశ్‌ కనగరాజ్‌ ‘ఖైదీ, విక్రమ్, మాస్టర్’ వంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ‘విక్రమ్’ తర్వాత తీసిన ‘లియో’ ఆశించిన మేరకు విజయం సాధించక పోవడంతో అందులో నుంచి పాఠాలను నేర్చుకున్నానని తెలిపారు. ‘లియో’ సినిమా తీయడంలో చేసిన తప్పులను ‘కూలీ’ లో చేయకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాలో తెలుగు నుంచి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), కన్నడ నుంచి ఉపేంద్ర, హిందీ నుంచి ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘కూలీ’ సినిమాపై అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. తనకు ఆమిర్ ఖాన్‌కు మధ్య సన్నివేశాలు లేవన్నారు. అయితే తన పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండబోతుందన్నారు. ఆమిర్ ఖాన్ చేసిన కొన్ని సీన్స్ చూశానని, ఆ పాత్ర ఎంతో థ్రిల్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరో వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. ఇప్పుడాయన చేస్తున్న ఈ ‘కూలీ’ సినిమాపై కూడా ఓ రేంజ్‌‌లో అంచనాలున్నాయి. తెలుగు స్టేట్స్‌లో కూడా ఈ సినిమా రైట్స్‌ భారీ ధర పలికినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!