Tamannaah Bhatia: ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ తమన్నా. ప్రస్తుతం అగ్ర కథానాయకుల సినిమాల్లో ఐటెంసాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉంటూ ఆడియన్స్‌లో జోష్ నింపుతున్నారు. ‘జైలర్’ సినిమాలో ‘నువ్.. కావాలయ్యా’ అంటూ రజనీకాంత్‌తో కలిసి వేసిన స్టెప్పులు కుర్రకారును ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఆజ్‌కీ రాత్’ అంటూ ‘స్త్రీ 2’లో ఆడిపాడారు. ‘జై లవకుశ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘స్వింగ్ జర’ అంటూ ఆడిపాడారు. ఇలా తమన్నా చేసిన ప్రతి సాంగ్ హిట్ కావడంతో స్పెషల్ సాంగ్స్‌కై ఆమె కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా ప్రభాస్ సినిమాలో తమన్నా ఐటెంసాంగ్ చేయబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే అయితే తమన్నా ఖాతాలో మరో హిట్ సాంగ్ పడటం ఖాయమంటున్నారు తమన్నా అభిమానులు.
Also Read – Kaushik Reddy: పేదోళ్ల పొట్టకొట్టిన కౌశిక్ రెడ్డి.. లబోదిబో అంటున్న జనం!
ప్రభాస్ సినిమాలో తమన్నా ఇప్పటికే ‘రెబల్’ సినిమాలో నటించి మంచి పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’లలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. దీంతో వీరిది హిట్ పెయిర్‌గా పరిగణిస్తున్నారు. మరోసారి వీరిద్దరూ కలిసి సాంగ్ చేయబోతున్నారనే వార్త ప్రభాస్ (Rebel Star Prabhas) అభిమానుల్లో జోష్ నింపుతోంది. ప్రభాస్, మారుతి కాంబోలో రాబోతున్న ‘ది రాజాసాబ్’ (The Rajasaab) లో తమన్నా ఐటెం సాంగ్ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. హర్రర్ కామెడీతో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎస్ ధమన్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ సినిమా హిట్ అవుతుందనే అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాట చిత్రీకరణ తేదీల కోసం తమన్నాతో మూవీ టీం చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Also Read – Ajay Devgn: సీఎం రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ భేటీ.. పెద్ద స్కెచ్చే వేశాడుగా!
వాస్తవానికి ఈ ఐటం సాంగ్ కోసం కరీనా కపూర్‌ని సంప్రదించినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడా లిస్ట్ లోకి తమన్నా వచ్చి చేరింది. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నయా ట్రెండ్ నడుస్తోంది. హీరోయిన్లు ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు ఐటెంసాంగ్‌లు చేసి ఆకట్టుకుంటున్నారు. సమంత, శ్రీలీల ‘పుష్ప’ సిరీస్ సినిమాలలో ఐటెం సాంగ్‌లు చేసి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నోరా ఫతేహి, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్‌లు ఇప్పటికే ప్రధాన పాత్రల్లో నటిస్తూ స్టార్ హీరోల సరసన ఆడి పాడుతున్నారు. సినిమాల్లో ప్రస్తుతం ఐటెంసాంగ్‌ల హవా నడుస్తోంది. ప్రతి సినిమాలోనూ ఓ ఐటెం సాంగ్ ఉండేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.