Venkatesh in Mega 157
ఎంటర్‌టైన్మెంట్

Venkatesh: చిరు-అనిల్ సినిమాలో గెస్ట్ రోల్.. వెంకీ మామ ఏమన్నారంటే..

Venkatesh: ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వచ్చి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న వెంకీ మామ (Victory Venkatesh).. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాల లిస్ట్ భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన తర్వాత సినిమాల గురించి తాజాగా అమెరికాలో అత్యంత వైభవంగా జరిగిన ‘నాట్స్‌ 2025’లో పాల్గొన్న ఆయన వెల్లడించారు. వెంకీ మామ చెప్పిన లిస్ట్ చూసిన ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ తర్వాత రానున్న సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు వస్తున్న వార్తలను వెంకీ మామ కూడా ధ్రువీకరించారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా గురించి ప్రచారం కూడా మొదలు పెట్టాడు అనిల్ రావిపూడి. అయితే ఇదే సినిమాలో వెంకీ మామ కూడా కనిపించబోతున్నారని టాక్.

Also Read –Nagpur Horror: పక్షవాతంతో భర్త.. ప్రియుడితో భార్య.. చివరికి ఏమైందంటే?

‘నాట్స్‌ 2025’ వేదికగా విక్టరీ వెంకటేష్ తాను నటించబోయే సినిమాల గురించి చెప్పారు. ‘‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. అలాగే మెగాస్టార్, అనిల్ సినిమాలో అతిథి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఆ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. మీనాతో కలిసి ‘దృశ్యం 3’ సినిమా చేస్తున్నా. ఇటీవల అనిల్‌ రావిపూడితో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్‌ కొట్టాం. మళ్లీ మేమిద్దరం కలిసి ప్రేక్షకులను నవ్వించడానికి రాబోతున్నాం. వీటితో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్‌ అయిన నా స్నేహితుడితో కలిసి మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను’’ అని తాను చేయబోతున్న లిస్ట్ మొత్తం చెప్పుకొచ్చారు వెంకీ మాట.

Also Read –American Hero: జల ప్రళయం.. 165 మందిని రక్షించిన రియల్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ‘మెగా 157’ రాబోతున్న విషయం తెలిసిందే. హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నారంటే మెగా అభిమానులు ఇప్పటికే ఆ సినిమా హిట్ అవుతుందనే అంచనాలలో ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాదిలోనే పూర్తి చేసి, 2026 సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు మేకర్స్. మరోవైపు ‘విశ్వంభ‌ర‌’ కూడా పూర్తి చేసిన మెగాస్టార్‌, అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ త‌ర్వాత ‘ద‌స‌రా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మ‌రో సినిమా చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా ఇప్పటికే మెగాస్టార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?