The 100 Movie: ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘ది 100’. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌కు రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు హ్యూజ్ బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాను జూలై 11న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతితులుగా హాజరై, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read- Hari Hara Veera Mallu: రెండుచోట్ల ‘వీరమల్లు’ ప్రీ రిలీజ్ జాతర.. గెస్ట్‌లు ఎవరంటే?
ఈ వేడుకలో మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మంచి మెసేజ్‌తో ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు. రైట్ టైమ్‌లో రైట్ సినిమా వస్తుందని నేను భావిస్తున్నాను. సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఫస్ట్ డే చూడాలని నిర్ణయించుకున్నాను. సైబర్ క్రైమ్ నేపధ్యంలో వున్న ఈ సినిమా సమాజానికి చాలా ముఖ్యం. సాగర్ అద్భుతమైన నటుడు. ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు వుంది. సొంత టాలెంట్‌తో గొప్ప స్థాయికి ఎదిగారు. భవిష్యత్తులో తను చాలా గొప్ప హీరో అవుతారు. ఈ సంవత్సరం బెస్ట్ ఫిలిమ్‌గా ‘ది 100’ సినిమా నిలుస్తుందనడంలో డౌటే లేదు. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. ఈ సినిమాని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా చూసి మెచ్చుకున్నారంటే కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సాగర్‌కు ఎప్పుడూ మా సపోర్ట్ ఉంటుంది. మొగలిరేకులు సీరియల్‌ని మా ఇంట్లో అందరూ చూసేవారు. ఆ సమయంలో ఏ పనులు చేసేవారు కాదు. అంతగా సాగర్‌ని అభిమానించే వాళ్ళు. సాగర్ అందరికీ సుపరిచితుడు. ఈ సినిమాలో చాలా మంచి మెసేజ్ ఉంది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో సాగర్ అద్భుతంగా ఫిట్ అయ్యాడు. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. సాగర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
Also Read- Thug Life OTT: ‘అన్నా.. నేనెవర్ని’.. ‘థగ్ లైఫ్’ని ఓటీటీలో చూసిన నెటిజన్ పోస్ట్ వైరల్!
మినిస్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను ఆల్రెడీ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. పవర్ ఫుల్ యాక్టింగ్‌తో పాటు ఇందులో గొప్ప మెసేజ్ కూడా ఉంది. సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మా ప్రాంత వాసి. సొంతంగా ఎదిగి ఇంత దూరం వచ్చాడు. మొగలిరేకులతో చాలా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తన పాత్రలు అన్నీ పవర్ఫుల్ గా ఉంటాయి. తన ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమా ఒక పవర్ఫుల్ వెపన్‌లా ఉంటుంది. చాలా మంచి కథ. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక ధైర్యాన్ని, సాహసాన్నిచ్చే సినిమా. డైరెక్టర్ చాలా అద్భుతంగా సినిమా తీశారు. సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలకి సమాధానం దొరికే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను. అందరూ సినిమాను చూసి పెద్ద విజయం అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు