Hari Hara Veera Mallu
ఎంటర్‌టైన్మెంట్

HHVM: రిలీజ్‌కు ముందు వివాదంలో హరిహర వీరమల్లు.. టెన్షన్‌లో ఫ్యాన్స్!

HHVM: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న సినిమా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్‌కు ముందు కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారని ముదిరాజ్ సంఘం నేతలు మండిపడుతున్నారు. సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. పాలమూరు కేంద్రంగా పండుగ సాయన్న పనిశారని.. తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరు తెచ్చుకున్నట్లు గుర్తు చేస్తున్నారు. దొరలు, దేశ్ ముఖ్‌ల సంపద కొల్లగొట్టి పేదలకు పంచిన వ్యక్తి సాయన్న అని.. అలాంటి సాయన్న కథను వక్రీకరించారని ముదిరాజ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయన్న జీవిత చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రలో లేని కల్పిత పాత్రలో హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేస్తున్నారని.. సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. ‘ చిత్రాన్ని అడ్డుకుందాం.. బహుజనుల ఆత్మగౌరవం కాపాడుకుందాం’ అని ముదిరాజ్‌లు నినదిస్తున్నారు. దీంతో సినిమా రిలీజ్ ముందు ఏం జరుగుతుందో అని అభిమానులు, సినీ ప్రియులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

Read Also- Gangster: గ్యాంగ్ లీడర్ భార్యతో అక్రమ సంబంధం.. సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్‌

ముందే చెప్పినా..!
వాస్తవానికి.. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఊహాజనితమైన పాత్ర అని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలియజేసింది. సాయన్న (Sayanna) జీవితంతో దీనికి ప్రత్యక్ష సంబంధం లేదని చిత్ర యూనిట్, దర్శకుడు క్రిష్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఈ వివరణలు బీసీ సంఘాలను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాయి. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్‌తో కల్పిత పాత్రను సృష్టించడం బహుజనుల, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. వినోదం, డబ్బుల కోసం బహుజన నాయకుడి చరిత్రను తప్పుదోవ పట్టించేలా సినిమా తీస్తే ఊరుకోమని, సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్బంగా బహుజన సంఘాల సమావేశంలో బీసీ నాయకుడు డాక్టర్ వై. శివ ముదిరాజ్ మాట్లాడుతూ.. సినిమాలో చరిత్రను వక్రీకరిస్తూ, పండుగ సాయన్న వీరగాథను తారుమారు చేస్తూ, కల్పిత కథలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం సినిమా కాదని.. బహుజనుల జ్ఞాపకాలను అపహాస్యం చేయడమే అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ చిత్రం బహుళ విభాగాల ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. చరిత్రకు బహుజనుల సామూహిక గౌరవానికి వ్యతిరేకంగా ఉందని శివ మండిపడ్డారు. ఇదంతా కేవలం డబ్బుల కోసమే తప్పుదారి పట్టించేలా ఉందని.. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రాన్ని బహుజనులంతా కలిసి అడ్డుకోవాలని ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు.

Sayanna Issue

వ్యూస్‌పైనా వివాదం!
మరోవైపు.. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత, ఒకే రోజులో అత్యధిక వ్యూస్‌ను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ వ్యూస్‌ అన్నీ నకిలీవని సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా, ట్రైలర్ విడుదలైనప్పుడు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం మామూలే. ఇది సాధారణంగా కొన్ని పెద్ద సినిమాలకు ఎదురయ్యే సమస్యే. ఇదిలా ఉంటే.. సినిమాలోని కొన్ని సీన్లు ఇతర సినిమాల్లో నుంచి కాపీ కొట్టినట్లుగా.. డైలాగ్స్ సైతం కొందరు రాజకీయ నేతలను కించపరిచినట్లుగా ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినిమాను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటున్నారని, సినిమా థియేటర్ల యజమానులు.. పంపిణీదారుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ లబ్ధి కోసం సినిమాను వాడుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంలో పవన్ భాగస్వామిగా ఉండటం.. డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తుండటంతో ఆయన నటించిన సినిమాపై సహజంగానే విమర్శలు, ఆరోపణలు వస్తుంటాయి. సినిమా విజయం కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వరుస వివాదాలు సినిమా విడుదల, ప్రేక్షకుల్లో దాని ఆదరణపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందే.

Read Also- Raghurama: రఘురామ దగ్గర బ్లడ్ బుక్.. బ్యాంక్ బుక్ సంగతేంటి?

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్