Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఆయన చేయాల్సిన సినిమాల షూటింగ్స్ ఆలస్యమవుతూ వచ్చాయి. రాజకీయాల్లో వంద శాతం సక్సెస్ రేట్ కొట్టిన తర్వాత, ఆగిపోయిన షూటింగ్స్‌ని చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చారిత్రాత్మక యోధుడిగా నటించిన ‘హరి హర వీర మల్లు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజకీయాల్లో చక్రం తిప్పిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘హరి హర వీర మల్లు’ జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్ల కోసం నిర్మాతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే..
Also Read- Gangster: గ్యాంగ్ లీడర్ భార్యతో అక్రమ సంబంధం.. సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
‘హరి హర వీర మల్లు’ ప్రీ రిలీజ్ వేడుకను (Hari Hara Veera Mallu Pre Release Event) రెండు చోట్ల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట జూలై 17న వారణాసిలో జరిగే ఈవెంట్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. యోగితో పాటు ఉత్తరప్రదేశ్ మంత్రులు, భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం. ఇక రెండో వేడుక విషయానికి వస్తే.. జూలై 19న తిరుపతిలో మరో ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. సీఎంతో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారనేలా టాక్ నడుస్తుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు సంబంధించి మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read- Thug Life OTT: ‘అన్నా.. నేనెవర్ని’.. ‘థగ్ లైఫ్’ని ఓటీటీలో చూసిన నెటిజన్ పోస్ట్ వైరల్!
‘హరి హర వీర మల్లు’ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను రాబట్టుకుంటూ.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. టాలీవుడ్ ట్రైలర్ వ్యూస్ లిస్ట్‌లో ఈ సినిమా చరిత్రను సృష్టించింది. ఇంకా, ఇప్పటి వరకు పుష్ప పేరు మీద ఉన్న రికార్డును కూడా బద్దలగొట్టింది. ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 48 మిలియన్స్ ప్లస్ వ్యూస్ సంపాదించింది. దీంతో, ఇప్పటి వరకు పుష్ప పేరు మీద ఉన్న 44 మిలియన్ వ్యూస్ రికార్డు బద్దలైంది. ఈ సినిమా కూడా అంచనాలను మించి ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఔరంగజేబు దురాగతాలను ప్రశ్నించే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు కీరవాణి అందించిన మ్యూజిక్, శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కొంత భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, మిగిలిన భాగాన్ని మూవీ నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.