Natural Star Nani and Nithiin
ఎంటర్‌టైన్మెంట్

Natural Star Nani: తమ్ముడూ.. నాని తప్పించుకున్నాడు.. నితిన్ బుక్కయ్యాడు!

Natural Star Nani: కెరీర్ ప్రారంభంలో హిట్లమీద హిట్లు కొట్టి ప్రస్తుతం హిట్ కోసం ఎదుగు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో నితిన్ (Nithiin) ఒకరు. రీసెంట్‌గా రిలీజైన ‘తమ్ముడు’ (Thammudu) ఆశించిన మేరకు ఆడలేదు. అయితే ఈ సినిమా నుంచి తప్పంచుకున్నాడని నేచురల్ స్టార్ నానిపై కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకు అంటే, ‘తమ్ముడు’ స్ర్కిప్ట్‌ని ముందుగా దర్శకుడు వేణు శ్రీరామ్ (Venu Sriram).. నానీతోనే తీయాలనుకున్నాడట. నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ఈ కథలో ఏదో లోపం గమనించి ఈ ప్రాజెక్టు నుంచి తప్పించుకున్నారని టాక్. తర్వాత ఇదే కథను నితిన్‌కు వినిపించగా ఆయన ఒప్పుకోవడంతో దిల్ రాజు నిర్మాణంలో సెట్స్ పైకి వెళ్లింది. విడుదలకు ముందు ఎన్నో ప్రమోషన్స్ చేసినా ఫలితం లేకపోయింది. విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియా ట్రోలింగ్, బాక్సాఫీస్ పరాజయం అన్నీ ఒకేసారి ఎదురయ్యాయి. నితిన్ కథల ఎంపికలో మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాడంటూ కామెంట్లు పడుతున్నాయి.

Also Read- Suspense Case: వరుసగా క్యాబ్‌ డ్రైవర్ల మిస్సింగ్ కేసులో సంచలనం

ఒకప్పుడు దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండేవి. అంతే, రిలీజ్‌కు ముందే హిట్ టాక్ నడిచేది. అయితే ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎస్వీసీ బేనర్‌పై వచ్చిన సినిమాలు కూడా పరాజయం పాలవుతున్నాయి. దిల్ రాజు కూడా కథల విషయంలో తడబడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా ‘ఫ్యామిలీ స్టార్, థాంక్యూ, గేమ్ ఛేంజర్, తమ్ముడు’ చిత్రాలు ఊహించని రీతిలో ఫ్లాప్ అయ్యాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మాత్రమే ఈ మధ్య కాలంలో ఆ బ్యానర్ నుంచి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ‘తమ్ముడు’ పరాజయం తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ మీద కూడా చర్చలు మొదలయ్యాయి. ఆయనతో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక నితిన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు బలగం వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దీనిపై కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే బలగం వేణు ముందుగా నానీకే కథ వినిపించాడట. అది నానీకి నచ్చకపోవడంతో నితిన్‌తో తీస్తున్నాడని సమాచారం.

Also Read- Raghurama: రఘురామ దగ్గర బ్లడ్ బుక్.. బ్యాంక్ బుక్ సంగతేంటి?

వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నేచురల్ స్టార్ నాని నటుడిగా.. నిర్మాతగా ఫుల్ సక్సెస్‌లో ఉన్నాడు. అలాంటి సమయంలో ‘తమ్ముడు’ లాంటి కథలను వదిలేయడమే మంచిదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. నటుడిగా ‘సరిపోదా శనివారం’ ‘హిట్ 3’లతో నాని తన మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నాడు. నిర్మాతగా ‘అ!’, ‘హిట్’ సిరీస్ చిత్రాలు, ‘కోర్టు’ సినిమాలతో వందశాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. నాని తర్వాతి చిత్రం ‘ప్యారడైజ్’కు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?