Rakul Husband: బాలీవుడ్‌లో సినిమా ప్లాప్ అయ్యిందంటే చాలు.. ఒక్కసారిగా నిర్మాతల మీద రూమర్లు మొదలవుతాయి. ఇప్పుడు అదే జరిగింది యంగ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ (Jackky Bhagnani)కి. ఒకప్పుడు టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుని ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) గతేడాది బాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆయన అక్షయ్ కుమార్ – టైగర్ ష్రాఫ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తీసిన ‘బడే మియా ఛోటే మియా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. దీంతో ఒక్కసారిగా జాకీ భగ్నానీ మీద రూమర్లు మొదలయ్యాయి. ‘బడే మియా ఛోటే మియా’ సినిమా ఫ్లాప్‌తో నిర్మాత ఒక్కసారిగా రోడ్డుమీదకు వచ్చేశాడని, ఇప్పుడు తినడానికి కూడా లేదని, ఉన్న ఆస్తులు అన్నీ తాకట్టులో ఉన్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా జాకీ భగ్నానీ దీనిపై స్పందించారు. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దు అంటూ కొట్టిపడేశారు.
Also Read-Kishan Reddy: బస్తీలో పర్యటన.. ముక్కు మూసుకున్న కేంద్రమంత్రి
సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎవరూ తీయరని, అందరూ కష్టపడితేనే సినిమా పూర్తవుతుందని తెలిపారు. అయితే ‘బడే మియా ఛోటే మియా’ సినిమా కోసం జూహు ఆఫీస్‌ను తనఖా పెట్టాల్సి వచ్చిందని, సినిమా నిర్మాణంలో ఉండగా ఈ పని చేయాల్సి వచ్చిందని, సినిమా అయిన వెంటనే తాకట్టు పెట్టిన దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నానని తెలిపారు. అంతే తప్పితే, తాను పెద్దగా నష్ట పోయింది ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ రూమర్లు ఎలా పుట్టాయో తనకు కూడా తెలియదని, వీటిపై తానెవ్వరినీ తప్పుపట్టట్లేదని వివరించారు. తనపై వచ్చిన ఫేక్ వార్తలపై కొంత బాధపడ్డానంటూ చెప్పారు. మరీ అంత దారుణంగా ఎవరు ఫేక్ వార్తలు రాశారో తెలీదు. తినడానికి తిండి కూడా లేదని.. ఎటో పారిపోయాడంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు రాశారు. అవి వారి వ్యక్తిత్వానికే వదిలి పెడుతున్నాను. ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడంలేదని బాధపడ్డారు. అలీ అబ్బాస్ జాఫర్‌కు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చి తప్పు చేశానన్నారు. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడతానన్నారు.
Also Read- Venky Atluri: కళాకారులు కృష్ణా నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రావాలంటే ఉండాల్సింది ఇదే..
రకుల్, జాకీ మూడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన ఫిట్‌నెస్ విషయాలను పంచుకోవడమే కాకుండా.. నెటిజన్లకు కూడా టిప్స్ ఇస్తూ ఉంటుంది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రకుల్ ప్రీత్‌తో సహా ఆమె భర్త జాకీ భగ్నానీని ఫిట్ ఇండియా కపుల్ అవార్డుతో సత్కరించింది. ఈ టైటిల్‌ను కేంద్ర ప్రభుత్వం యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కపుల్‌కు అందజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.