Sapthami Gowda: కొంతమంది ముక్కుపుడక పెట్టుకోవడాన్ని ఇష్టపడరు. ఒక్కొక్కరు ముక్కుకి రెండు వైపులా పెట్టుకుంటారు. యంగ్ హీరోయిన్లు ఎక్కడ ముక్కుపుడక పెట్టుకుంటే అవకాశాలు రావో అని చెప్పి, అసలు పెట్టుకోవడానికి కూడా అంగీకరించరు. కానీ సప్తమి గౌడ మాత్రం ‘కాంతార’ (Kantara) సినిమాలో ముక్కుపుడక పెట్టుకుని కనిపించి.. అందరినీ మెప్పించింది. అంతేకాదు, ఈ ముక్కుపుడక గురించి చాలా అద్భుతంగా చెప్పుకొచ్చిందామె. తాజాగా ఆమె నటించిన ‘తమ్ముడు’ చిత్రం థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ‘ముక్కుపుడక’ విశిష్టతను చెప్పి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ముఖ్యంగా ఈ ముక్కుపుడకతో ఆడవాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఆమె చెబుతుంటే.. ఒక్కొక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
Also Read- Vishwambhara vs OG: అన్నదమ్ముల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా?
‘‘ముక్కుపుడక పెట్టుకోవడం, పెట్టుకోకపోవడం అనేది ఎవరికివారికి వ్యక్తగతమైన విషయం. ‘కాంతార’ సినిమాలో నేను రెండు వైపులా పెట్టుకున్నాను. కాకపోతే కుడి వైపు కాస్త ఇబ్బందిగా ఉంటే తీసేయడం జరిగింది. రెండు సంవత్సరాల పాటు ప్రతిరోజు ముక్కుపై దానిని టచ్ చేస్తూ ఉండేదాన్ని. ఫేస్ వాష్ చేసిన ప్రతిసారి టచ్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా తీసేస్తూ ఉండే మా మదర్ వద్దు వద్దు అని తీయనిచ్చేది కాదు. నేను ముక్కుపుడక పెట్టుకోక ముందు నుంచే.. అమ్మ ఎప్పుడూ నన్ను అడుగుతూ ఉండేది. నువ్వు ముక్కుపుడక పెట్టుకో.. చాలా బాగుంటుందని చెబుతుండేది. మన సనాతన, హిందూ ధర్మాలలో కూడా ముక్కుపుడకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సైంటిఫిక్‌గా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిరూపితమైంది. ముక్కుపుడక, చెవులకు పెట్టుకునే రింగ్స్, నుదిటిన పెట్టుకునే బొట్టు వల్ల స్త్రీలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సైంటిఫిక్‌గా కూడా చెప్పడంతో.. నేను కూడా అలవాటు చేసుకున్నాను. దానిని కంటిన్యూ చేస్తున్నాను. నేను సివిల్ ఇంజనీర్ చేశాను. ఇప్పుడిప్పుడే నా సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Hari Hara Veera Mallu Trailer: బెబ్బులి వేట మొదలైంది.. 24 గంటల్లోనే ‘పుష్ప 2’ రికార్డ్ అవుట్!
సప్తమి గౌడ ‘కాంతార’ చిత్రంలో నటనకు గానూ ఎన్నో ప్రశంసలు అందుకుంది. తెలుగులో ‘తమ్ముడు’ (Thammudu) ఆమెకు డైరెక్ట్ తెలుగు చిత్రం. ఇందులోని తన పాత్ర గురించి సినిమా విడుదలకు ముందు సప్తమి గౌడ ఏం చెప్పిందంటే.. ‘అంబరగొడుగు అనే ఊరిలో ఉండే రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమాని. నా క్యారెక్టర్‌కు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ‘కాంతార’తో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ.. పాత్రగా చూస్తే పూర్తిగా భిన్నమైనది. ‘తమ్ముడు’ కాస్త సీరియస్ సబ్జెక్ట్.. ఇందులో నా పాత్ర ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా కోసం కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రైడింగ్ చేయాల్సివచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బంది పడ్డాను. సినిమాలో ఆ సీన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది..’ అని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు