Anganwadi( IMAGE credit: twitter)
తెలంగాణ

Anganwadi: సొంత భవనాలేని అంగన్‌వాడీలు.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం బహిర్గతం!

Anganwadi: మూడు నుంచి ఐదేళ్ల వయస్సు గల చిన్నారులకు ఆటపాటలతో విద్యాబుద్దులు నేర్పి ప్రాథమిక పాఠశాలలో నమోదు చేయించేందుకు సంసిద్ధం చేయడానికి అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాలను (పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలను) గ్రామాల్లో ఏర్పాటు చేశారు. చిన్నారులకు బోధనతో పాటు, పోషక విలువలున్న ఆహారాన్ని అందించడం ఈ కేంద్రాల ఉద్దేశ్యం. అంత ప్రాధాన్యమున్న ఈ కేంద్రాలు జిల్లాలో మౌలిక వసతులు లేక నిరుపయోగమవుతున్నాయి.

గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కాలం వెల్లదీస్తున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చాక సొంత భవనాల నిర్మాణానికి కసరత్తు ప్రారంభించింది. ప్రతి మండలానికి రెండు అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు భవన నిర్మాణానికి భూములను గుర్తించినట్లు సమాచారం.

 Also ReadMahesh Kumar Goud: ఆమెకు బీఆర్ఎస్‌లో సభ్యత్వం ఉందా?.. పీసీసీ చీఫ్​ సంచలన కామెంట్స్!

అంగన్‌వాడీల అభివృద్ధిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం
అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. సొంత భవనాలు నిర్మించక పోవడంతో అద్దె గదుల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 12,248 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సొంత భ‌వ‌నాలు ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రాలు11,843 కాగా, రెంట్ ఫ్రీ అంగ‌న్‌వాడీ కేంద్రాలు 11,690 ఉన్నాయి. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో 1,72,090 మంది గ‌ర్బిణులు, 15,18,813చిన్నారులు సేవలు పొందుతున్నారు.

అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో లబ్ధిదారులు, బాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామమాత్రంగా ఒకటో, రెండు చోట్ల మాత్రమే సొంత భవనాల నిర్మాణాలు ప్రారంభించినా అవి పునాదులను వీడడం లేదనే ఆరోపణలున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న చోట శాశ్వత ప్రాతిపదికన కొత్త భవనాలు నిర్మించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో అవసరమైన ప్రతిపాదనలు రూపొందించారు. కానీ అవి ముందుకు సాగలేదు.

అద్దె చెల్లింపుల్లోనూ జాప్యం?
అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాల అద్దె చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రతినెలా అద్దె చెల్లింపు తాలుకు సొమ్మును టీచర్లకు చెల్లించడం లేదు. దీంతో టీచర్లు అద్దె చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దెకు తీసుకున్న భవనాల్లో గదుల సంఖ్యను బట్టి ప్రభుత్వం అద్దెను చెల్లిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే అరకొర అద్దెకు గ్రామాల్లో ఎక్కడా భవనాలు దొరికే పరిస్థితి లేదు. దీంతో అంగన్‌వాడీ టీచర్లు సొంతంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు గదులకు రూ.750లు అద్దెగా చెల్లిస్తున్నది. రెండు గదులకు రూ.500లు, ఒక్క గదికి రూ.250ల చొప్పున చెల్లిస్తున్నది. ఈ చెల్లింపులు గిట్టుబాటు కాక గృహ యజమానులు అద్దెకు భవనాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీంతో కేంద్రాలను నిర్వహించాల్సిన బాధ్యత టీచర్లపై ఉండడంతో తమ సొంత సొమ్మును కొంత కలిపి యజమానులకు అద్దె రూపంలో చెల్లిస్తున్నట్లు సమాచారం.

మౌలిక వసతులు కరువు
సొంత భవనాలు గల అంగన్‌వాడీ కేంద్రాలు సైతం మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాయి. నిరుపయోగంగా పడి ఉన్న మరుగుదొడ్లు ఈ కేంద్రాల్లో దర్శనమిస్తున్నాయి. సరైన ఆట స్థలాలు లేక చిన్నారులు ఆట, పాటలకు దూరమవుతున్నారు. ఇరుకు గదుల్లో కేంద్రాలను నిర్వహిస్తుండడం అసౌకర్యంగా మారింది. సొంత భవనాల పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే, ఇక అద్దె భవనాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మంత్రి సీతక్క చొరవతో అంగన్‌వాడీ భవనాలు
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దె భవనాల్లో అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాలు కొనసాగుతుండడంతో చిన్నారులు, గర్బీణులు పడుతున్న ఇబ్బందులపై మంత్రి సీతక్క (Seethakka)  ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది మండలానికి రెండు అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర వ్యాప్తంగా 1148 టార్గెట్ పెట్టారు. ఇప్పటికే అన్ని మండలాల్లో భవన నిర్మాణాలను స్థలాలను గుర్తించినట్లు సమాచారం. ఒక్కో అంగన్‌వాడీ భవనానికి ఉపాధి హామీ నిధులు లక్షలు, 15వ పైనాన్స్ కమిషన్ నిధులు రూ.2లక్షలు, మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి రూ.2 లక్షలు మొత్తం12 లక్షలతో వచ్చే ఏడాది మార్చి నాటికి 1148 భవనాలను నిర్వహించనున్నట్లు సమాచారం. త్వరలోనే అంగన్‌వాడీ (Anganwadi) భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డితో భూమి పూజ చేయించడం జరుగుతుందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు.

 Also ReadKavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?