Mega Heroes Reaction on HHVM Trailer
ఎంటర్‌టైన్మెంట్

Mega Family: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై మెగా హీరోల స్పందనిదే..

Mega Family: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. గురువారం ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ను అందుకుంటూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌పై మెగా హీరోలు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), మెగా బ్రదర్ నాగబాబు (Naga Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఇక మెగా అభిమానులను పట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. చాలా గ్యాప్ తర్వాత, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేయని జానర్‌లో ఈ సినిమా రాబోతుండటంతో పాటు, ట్రైలర్ కూడా వారు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉండటంతో.. ఈసారి బాక్సాఫీస్‌ విధ్వంసం అంటే ఏంటో చూస్తారు.. అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ట్రైలర్‌పై మెగా హీరోల స్పందనను గమనిస్తే..

Also Read- HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?

‘‘ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్.. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబు (పవన్ కళ్యాణ్) నుంచి రాబోతున్న ఈ సినిమాతో థియేటర్లు దద్దరిల్లడం తధ్యం. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్!’’ అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘‘ఈ మూవీ అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ చెప్పేస్తుంది. బిగ్ స్క్రీన్‌పై కళ్యాణ్ బాబాయ్ అందరికీ ట్రీట్ ఇవ్వబోతున్నారు. టీమ్‌కు ఆల్ ద బెస్ట్’’ అని పోస్ట్ చేశారు. ఇక సాయి దుర్గ తేజ్ గురించి చెప్పేదేముంది. ‘‘ఆంధీ వచ్చేసింది! ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎంతో శక్తివంతంగా, సంచలనాత్మకంగా ఉంది. నా గురువు, పవన్ కళ్యాణ్ మామ, పూర్తి స్థాయిలో తన సత్తా ప్రదర్శించారు. వీర మల్లు ఎప్పుడూ ధర్మం కోసమే. జూలై 24న థియేటర్లలో ఈ పవర్ స్ట్రోమ్‌ని చూడటానికి ఎంతగానో వేచి చూస్తున్నాను’’ అని పోస్ట్ చేశారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ..

Also Read- Dil Raju: పైరసీపై కఠిన చర్యలకు ఎఫ్‌డీసీ ముందడుగు.. సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ అరెస్ట్

‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. హరి హర వీరమల్లు ట్రైలర్ నిజంగా ఆసక్తికరంగా ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మొత్తం తన సొంతం చేసుకున్నారు. ట్రైలర్‌లో విజువల్స్, సంగీతం, యాక్షన్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇంత అద్భుతమైన ట్రైలర్‌ను ఇచ్చిన టీమ్ మొత్తానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించిన మెగా హీరోలకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు