Hari Hara Veera Mallu
ఎంటర్‌టైన్మెంట్

HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?

HHVM Trailer: టాలీవుడ్ పవర్ స్టార్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ట్రైలర్ గురువారం రిలీజ్ అయ్యింది. ఇప్పటి వరకూ ఓ లెక్క అయితే.. ట్రైలర్‌తో సీన్ మొత్తం మారిపోయింది. సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అభిమానులు, సినీ ప్రియుల నుంచి ట్రైలర్‌పై మంచి స్పందన వస్తోంది. 2 నిమిషాల 57 సెకన్ల నిడివితో వచ్చిన ట్రైలర్‌ను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. పవన్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ‘ హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గోల్కొండ, ఢిల్లీ నేపథ్యంలో ఆ కాలం నాటి పరిస్థితులను, పవన్ కళ్యాణ్ యాక్షన్ సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. ఇక డైలాగ్స్, ఫైట్ సీన్లు అన్నీ అదుర్స్ అనిపించాయి. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కొన్ని కొన్ని ఫైట్ సీన్లు, డైలాగ్స్ చూస్తే ఎక్కడో విన్నట్టే.. చూసినట్లే ఉందే అనిపిస్తోంది. ఇంతకీ ఆ సీన్లు ఏంటి? డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

గట్టిగానే ట్రోలింగ్స్..!
‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌లోని కొన్ని సీన్లు కాపీ కొట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి తోచినట్లుగా వాళ్లు తమ అభిమాన హీరో సీన్లు కాపీ కొట్టారని తెగ ట్రోల్ చేసేస్తున్నారు. కొందరేమో నందమూరి బాలయ్య అఖండ-2, మరికొందరేమో బహుబలి, అరవింద సమేత.. ఇంకొందరేమో ఆర్ఆర్ఆర్, కంగువా సీన్లను తలపిస్తున్నాయని ట్రైలర్‌లో పార్ట్ టూ పార్ట్ కట్ చేసి మరీ ట్విట్టర్‌లో కొందరు హడావుడి చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా.. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ తోడేలుతో పోరాడే సన్నివేశాన్ని అందరూ గమనించే ఉంటారు. ఈ సన్నివేశం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పులితో పోరాడే దృశ్యాన్ని పోలి ఉందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండు సన్నివేశాల్లోనూ హీరో ఒక క్రూర జంతువుతో పోరాడుతూ కనిపించడం, ఆ పోరాట విధానం కొంత సారూప్యతను కలిగి ఉండటం ఈ పోలికకు కారణమని చెప్పుకోవచ్చు. ‘అఖండ-2’ ట్రైలర్‌లో బాలయ్య ఓ సీన్‌లో అందర్నీ తలకున్న కత్తులతోనే నరుక్కుంటూ పోతుంటారు.. ఇంచుమించు హరిహర వీరమల్లులో కూడా ఇదే సీన్ ఉందన్నది కొందరి విమర్శకుల వాదన. ఇక బడిసెతో చేసే ఫైట్ సీన్‌ అయితే ఒకటేమో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత’లో కత్తితో నరుక్కుంటూ పోయే సీన్‌ను.. ఇంకొకటి సూర్య నటించిన ‘కంగువా’.. ‘బాహుబలి-1’లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సీన్లు తలపిస్తున్నాయని ట్రోల్ నడుస్తోంది. వాస్తవానికి సినిమాల్లో కొన్ని సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఒకదానికొకటి పోలి ఉండటం సహజమే. ఎందుకంటే.. దర్శకులు ఇతర విజయవంతమైన చిత్రాల నుంచి ప్రేరణ పొందే అవకాశాలు ఎక్కువ. అయితే దాన్ని కాపీ కొట్టారని అనుకోవడం తప్పేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also- Vallabhaneni: వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని.. మంత్రి పదవి ఫిక్స్?

ఈ డైలాగ్ వెనుక..?
హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ట్రైలర్‌లో ‘నువ్వు మా వెర్రి విస్సన్న మావ‌య్య క‌దూ..’ అనే డైలాగ్‌పైన పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే.. గత నాలుగైదేళ్లుగా సినిమాల్లో, రాజకీయాల్లో ‘మావయ్యా’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఒకరేమో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పెట్టారని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరేమో నందమూరి బాలయ్యను ఉద్దేశించే ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ మధ్య పిల్లల చేత బ‌ల‌వంతంగానైనా ‘మావ‌య్య’ అని పిలిపించుకోవాల‌ని వైఎస్ జగన్ బాగా త‌హ‌త‌హలాడారని పెద్ద ఎత్తునే కామెంట్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఇవన్నీ కల్పితాలు మాత్రమే. ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్, చిత్ర విచిత్రాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఇవి కేవలం నెటిజన్ల అభిప్రాయాలు మాత్రమే. చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎటువంటి స్పందన లేదు. సినిమా విడుదలైన తర్వాతే, ఆ సన్నివేశాల పూర్తి ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ట్రైలర్‌పై ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనన్ని అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా హరిహర రాయలు.. ఔరంగజేబుతో ఫైటింగ్ చేయడమేంటి? రాయలు 13వ శతాబ్ధంలోనే చనిపోయాడు. ఇక ఔరంగజేబు వచ్చింది 16వ శతాబ్ధం కదా..? వీరిద్దరూ ఎప్పుడు ఎలా యుద్ధం చేశారు? అనే సందేహాలు మెగాభిమానులు, జనసేన కార్యకర్తల్లోనూ వస్తున్నాయి. కాగా, ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా.. ఈ చిత్రాన్ని ఏఎం. రత్నం నిర్మిస్తున్నారు. అయితే.. ‘హరిహర వీరమల్లు’ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు జూలై-24న విడుదలకు సిద్ధమైంది.

Read Also- Hari Hara Veera Mallu: ఒక్కటే మాట.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎలా ఉందంటే!

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు