Aamir khan: 2018లో పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ (Thugs of Hindostan)లో తన సరసన నటించడానికి హీరోయిన్ దొరకడం చాలా కష్టమైందని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ అవ్వదని తనకు ముందే తెలుసని అన్నారు. అలాగే అంతకు ముందు తన కుమార్తెగా వేసిన నటి ఫాతిమా సనాషేక్‌తో (Fatima Sana Shaikh) స్క్రీన్ షేర్ చేసుకోవడంపై కూడా ఆయన మాట్లాడారు. వాస్తవానికి ఈ సినిమాకు మొదట ఫాతిమా సనాషేక్ హీరోయిన్ కాదు.. దీపికా పదుకొణె, అలియా భట్ సహా పలువురు ప్రముఖ హీరోయిన్లు యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్‌ను తిరస్కరించిన తర్వాత.. నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య.. ‘దంగల్’ భామను ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటింపజేశారు. తన కుమార్తెగా అంతకు ముందు నటించిన ఫాతిమా సనాషేక్‌కు ప్రియుడిగా నటించినందుకు నేనేం ఇబ్బంది పడలేదని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
Also Read- Shirish Reddy: రామ్ చరణ్‌ని అవమానించడమా.. అది నా జన్మలో జరగదు!
ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’లో హీరో పాత్రకు ప్రియురాలిగా ఏ హీరోయిన్ నటిస్తే బాగుంటుందా? అని మొదట మేమంతా ఎంతగానో చర్చించుకున్నాం. దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్, అలియాభట్ వంటి తారలందరినీ సంప్రదించాం. కానీ, వారెవరూ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. బహుశా.. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో వారంతా ఈ సినిమాలో చేయమని చెప్పి ఉండొచ్చు. చివరకు ఫాతిమా సనాషేక్‌ను ఆ పాత్ర కోసం ఎంపిక చేయాల్సి వచ్చింది. ఆమె కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరిచింది. అంతకు ముందు మేమిద్దరం ‘దంగల్’ కోసం పనిచేశాం. అందులో తండ్రీకుమార్తెలుగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు మాకో విషయం చెప్పారు.. అదేంటంటే..
Also Read- Hari Hara Veera Mallu: ఒక్కటే మాట.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ ఎలా ఉందంటే!
ఈ సినిమాలో మీ పాత్రల మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో మీరిద్దరూ తండ్రీకుమార్తెలుగా చేసి ఉన్నారు. ఇప్పుడు ప్రేమికులుగా ఇద్దరు రొమాన్స్ చేస్తే.. చూసే ప్రేక్షకులు వేరేలా అర్థం చేసుకుంటారు. అది సినిమాకు బాగా ఎఫెక్ట్ అవుతుందని అన్నారు. కానీ నేను అతని మాటలను ఖండించాను. ప్రేక్షకులు అన్నీ తెలుసు, వాళ్లేం తెలివితక్కువ వారేం కాదని వాదించాను. నిజ జీవితంలో మేమిద్దరం ఎవరో, మా మధ్య రిలేషన్స్ ఏంటో వారికి తెలుసని, ప్రేక్షకులు తప్పుగా ఏమీ అనుకోరని దర్శకనిర్మాతలకు చెప్పాను. కాకపోతే సినిమా చిత్రీకరణ సమయంలో స్క్రిప్ట్ మార్చడం కారణంగా, మొదట అనుకున్న విధంగా సినిమాను రూపొందించలేకపోయాం. సినిమా సక్సెస్ కాకపోవడానికి అదే మెయిన్ కారణం. సినిమా షూటింగ్ సమయంలోనే రిజల్ట్‌పై నాకో క్లారిటీ వచ్చిందని ఆమిర్ ఖాన్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు