Employees(image credit:twitter)
తెలంగాణ

Employees: సమస్యలపై ప్రశ్నించినోళ్ల ఇక్రిమెంట్లు కట్!

Employees: ఆర్థిక శాఖ పరిధిలో కొనసాగే ట్రెజరీస్ డైరెక్టర్, అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య వివాదం నెలకొన్నది. ఉద్యోగస్తుల సమస్యలకు  పరిష్కారం చూపాలని అదే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల (Trade Unions) నాయకులు డైరెక్టర్‌ను కోరారు. పదే పదే తనను అడుగుతున్నారని ఆగ్రహించిన డైరెక్టర్, ఏకంగా తమ ఇక్రిమెంట్లే కట్ చేయించారనే ఆరోపణలు ఉద్యోగ సంఘ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. పైగా ఉద్యోగ సంఘాల నాయకులైతే నాకెంటి? నన్ను ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని ఆయన పరుష పదాలతో దుర్భషలాడినట్లు ఉద్యోగులు చెప్పారు.

ఫైనాన్స్ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ డైరెక్టర్‌పై ఇప్పటికే సీఎస్ రామకృష్ణారావుకు (CS Ramakrishna Rao) కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై వెంటనే ఎంక్వైయిరీ వేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. లేకుంటే సచివాలయంలోని ఉద్యోగులతో పాటు డైరెక్టరేట్‌లోని ఎంప్లాయిస్ అంతా తమ నిరసనలు వ్యక్తం చేయాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఇదే అంశాన్ని సీఎం, డీప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం!

క్రమశిక్షణ చర్యల కింద..

ఉన్నతాధికారులను ప్రశ్నించినందుకు గాను డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నట్లు ఫైనాన్స్ సెక్రెటరీ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో జీ పురుషోత్తం రెడ్డికి మూడు ఇంక్రిమెంట్లు, వై పరశురాం కు రెండు, సీహెచ్ శిరిషాకు మరొక ఇంక్రిమెంట్‌ను రద్దు చేశారు. ఇది పనిష్మెంట్ అంటూ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఎంప్లాయిస్ సంఘంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఉద్యోగస్తుల (Employees) సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమపై ఉంటుందని, దీన్ని సీరియస్ ఇష్యూగా క్రియేట్ చేసి, తమపై చర్యలు తీసుకోవడమేంటి అంటూ ఉద్యోగ సంఘాల నాయకులు వాపోతున్నారు.

ఈ సర్క్యూలర్ పై ఉద్యోగ సంఘ నాయకులు కూడా గోప్యంగా ఉంచినప్పటికీ, డైరెక్టర్ ప్రవర్తన నిత్యం తీవ్రమైన పదజాలంతో విమర్శలు నెలకొన్న నేపథ్యంలో (Secretariat) సచివాలయంలోని ఎంప్లాయిస్ అసోసియేషన్ సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు రెడీ అయింది. ఆర్థిక శాఖ అధికారులపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిల్లుల క్లెయిమ్ విషయంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ప్రభావం చూపుతున్నాయి. ఇవి మరువకముందే మరో కొత్త ఇష్యూ సెక్రటేరియట్ ఉన్నతాధికారుల్లో చక్కర్లు కొడుతున్నది.

 Also Read: Medchal District: మేడ్చల్ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్.. కార్మికుడికి గాయాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!