Samantha and Raj Nidimoru: అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు తన సినీ కెరీర్‌పై పూర్తి దృష్టి సారించి వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా మారింది. ఇటీవల సామ్ నిర్మాతగా మారి శుభం అనే కొత్త సినిమాను నిర్మించింది. సినిమాలకు కొన్నాళ్లు దూరంగా ఉన్నా కూడా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న సమంత, పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాజ్ నిడిమోరుతో డేటింగ్ గాసిప్స్
సిటాడెల్, ఫ్యామిలీ మెన్ వంటి సిరీస్‌లకు డైరక్షన్ చేసిన రాజ్ నిడిమోరుతో సమంత కొంతకాలంగా క్లోజ్ గా ఉంటూ .. ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తున్నారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని తెలిసిన సమాచారం. ఈ విషయం పై తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లడం, శుభం సినిమా సక్సెస్ ఈవెంట్ లో కూడా సమంతతో రాజ్ కనిపించడం సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తుంది. రూమర్స్ కు చెక్ పెట్టాలని ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిన సమాచారం.
సమంత రూత్ ప్రభు, డైరెక్టర్ రాజ్ నిడిమోరులు తమ మధ్య సంబంధం గురించిన పుకార్లను పలుమార్లు ఖండించినప్పటికీ, ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు భార్య గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో నమ్మకం, ప్రేమ, సంబంధాల గురించి పోస్టులు పెట్టడంతో అనేక అనుమానాలను వస్తున్నాయి. ఇక వీటికి చెక్ పెట్టాలని.. ఈ ఏడాది చివరిలో సమంత, రాజ్ ల బంధాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.