Ram Charan: రామ్ చరణ్ ఏ సాయం చేయలేదు.. నిర్మాత శిరీష్?
Ram Charan ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Charan: రామ్ చరణ్ వాళ్ళకి అంత బాధను మిగిల్చాడా.. గేమ్ ఛేంజర్ నిర్మాత సంచలన కామెంట్స్

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతేకాదు, నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిందని ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే నిర్మాత శిరీష్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ” తాము కోట్ల రూపాయలు నష్టపోయామని, అయినప్పటికీ రామ్ చరణ్ నుంచి కానీ, దర్శకుడు శంకర్ నుంచి ఇంత వరకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని వ్యాఖ్యానించారు. అంత పెద్ద సినిమా పోయినా కూడా మేము ఎవరినీ బ్లేమ్ చేయలేదు.అలాగే ఎవరి నుంచి ఇచ్చిన రెమ్యూనరేషన్ ను వెనక్కి తీసుకుంది లేదు. మేము ఆ స్టేజ్‌కి ఇంకా దిగజారిపోలేదు ” అని శిరీష్ అన్నారు. తమ నిర్మాణ సంస్థ ఇప్పటికీ కూడా బలంగా ఉందని తెలిపారు.

మేము అన్నీ ఇబ్బందులు పడుతున్నా కూడా హీరో కాల్ చేయలేదంటూ నిర్మాత అలా చెప్పడంతో ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ కూడా ఇలా చేశాడా అంటూ కొందరు నమ్మలేకపోతున్నారు. ఇంకా అతను మాట్లాడుతూ ఏ హీరో సాయం చేయలేదు? ఇండస్ట్రీలో ఇలాగే ఉంటాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు కదా, ఆ సమయంలో ఇంకో సినిమా ఉంది కాబట్టి 70% రికవరీ చేయగలిగాము. లేదంటే మేము నష్టాల్లోకి వెళ్ళే వాళ్ళం. అనిల్ రావిపూడి మమ్మల్ని కాపాడాడు. ఆయన వల్లే ఈ రోజు ఇలాగే ఉన్నామంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశాడు. దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

శిరీష్ చేసిన షాకింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. రామ్ చరణ్,  శంకర్  ఇద్దరిలో ఎవరూ కూడా  సహాయం లేదని ఆయన చేసిన కామెంట్స్ కొంతమంది అభిమానులను కలవరపరిచాయి. అయితే, శిరీష్ తమ నిర్మాణ సంస్థ బలంగా ఉందని, ఎవరినీ నిందించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..