Maargan Team Theaters Visit
ఎంటర్‌టైన్మెంట్

Maargan: బాక్సాఫీస్ వద్ద విజయ్ ఆంటోని సినిమా పరిస్థితి ఏంటి?

Maargan: మల్టీ టాలెంటెడ్ పర్సన్ విజయ్ ఆంటోని (Vijay Antony) నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘మార్గన్’. లియో జాన్ పాల్ (Leo John Paul) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. ‘కన్నప్ప’ (Kannappa)కు పోటీగా ఆ సినిమా విడుదలైన రోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ‘కన్నప్ప’ హడావుడిలో ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ, థియేటర్లలో ఈ సినిమా కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. విజయ్ ఆంటోని సినిమాల్లో ఏదో ఒక న్యూ మ్యాటర్ ఉంటుందనే విషయం తెలియంది కాదు. ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు సైతం బాగా ఆదరిస్తున్నారు. హిట్, ఫ్లాప్ సంగతి పక్కన పెడితే.. విజయ్ ఆంటోని సినిమాలో కొత్తదనంతో నిండిన మెసేజ్ ఉంటుందనేది మాత్రం ప్రేక్షకులు మైండ్‌లో ఫిక్స్ అయ్యారు. ఇప్పుడీ ‘మార్గన్’ కూడా మంచి స్పందననే రాబట్టుకుంటుంది.

Also Read- Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!

ఈ సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ కూడా బాగానే కష్టపడుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ‘మార్గన్’ చిత్రానికి మంచి టాకే వచ్చింది. ఈ క్రమంలో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో సందడి చేశారు. సిటీలోని కొన్ని థియేటర్లలో సినిమాను చూస్తున్న ప్రేక్షకులకి ‘మార్గన్’ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా వంటి వారు థియేటర్లు సందర్శించి, ఆడియెన్స్‌తో ముచ్చటించారు. సినిమా ఎలా ఉంది అని ప్రేక్షకులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆడియెన్స్ రెస్పాన్స్‌ను లైవ్‌లో తెలుసుకుని, ‘మార్గన్’ టీం ఫుల్ ఖుషీ అవుతోంది. ముందు ముందు ఈ సినిమాకు కలెక్షన్లు బాగా పెరుగుతాయని టీమ్ భావిస్తోంది.

Also Read- Bayya sunny yadav: సన్నీ యాదవ్ పెట్టిన వీడియోలో నిజం లేదంటున్న నా అన్వేష్ ఊరి ప్రజలు

మొదటి నుంచి విజయ్ ఆంటోని సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. అందులోనూ తెలుగు ప్రేక్షకులు ఆయనని ఆదరించే తీరు చూసి, త్వరలోనే డైరెక్ట్ సినిమా తీస్తానని ఆయన మాట కూడా ఇచ్చారు. అంతేకాదు, తెలుగు ప్రేక్షకుల కోసం ఆయన, తెలుగులోనూ ట్వీట్స్ చేస్తుండటం విశేషం. ‘మార్గన్’ విషయానికి వస్తే.. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై జె.రామాంజనేయులు సమర్పించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జూన్ 27న టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న స్పందనతో చిత్రయూనిట్ హ్యాపీగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి ‘కన్నప్ప’ వంటి పాన్ ఇండియా సినిమాకు పోటీగా వస్తున్నప్పుడే ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకున్నారు. అందులోనూ మల్టీ టాలెండెడ్ పర్సన్ విజయ్ ఆంటోని నిర్మించిన సినిమా కావడంతో.. మొదటి నుంచి ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే దిశగా ఈ సినిమా థియేటర్లలో పెర్ఫార్మ్ చేస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్