Hari Hara Veera Mallu On Location
ఎంటర్‌టైన్మెంట్

HHVM Director: బాబీ డియోల్ పాత్రపై ఆసక్తి పెంచేసిన దర్శకుడు.. ఏం చెప్పారంటే?

HHVM Director: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ‘హరి హర వీరమల్లు’పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకొని సినిమాపై అంచనాలు పెంచేయగా.. జూలై 3న చిత్ర ట్రైలర్‌‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అలాగే పవన్ కళ్యాణ్ ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా మొదటిసారి చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తుండటం. ఇంకా ‘యానిమల్’ (Animal) సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న బాబీ డియోల్ (Bobby Deol).. ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తుండటం మరో ప్రత్యేకత.

Also Read- Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!

తాజాగా ఈ సినిమాలోని బాబీ డియోల్ పాత్రకు సంబంధించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘యానిమల్’ సినిమా కంటే ముందే ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలను ఆయనపై చిత్రీకరించారట. కానీ, ‘యానిమల్’ విడుదల తర్వాత బాబీ డియోల్ నటన చూసిన దర్శకుడు జ్యోతి కృష్ణ.. ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకుని.. ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచారట. ‘‘యానిమల్ సినిమాలో బాబీ డియోల్ నటన అద్భుతంగా ఉంటుంది. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకే హరి హర వీరమల్లు సినిమాలో ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని జ్యోతి కృష్ణ తెలిపారు.

HHVM

జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేశారని ఇటీవల నిర్మాత రత్నం కూడా చెప్పారు. బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఆయన.. మెరుగులు దిద్దడంతో ఔరంగజేబు పాత్ర మరింత బలంగా, ఆకర్షణీయంగా మారిందని యూనిట్ కూడా చెబుతోంది. ‘యానిమల్’ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. ఆ స్టార్‌డమ్‌‌కి న్యాయం చేయడానికి, ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారు. అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో ఆయన కీలక మార్పులు చేశారు.

Also Read- Actress Laya: అప్పటికీ, ఇప్పటికీ సినిమా రంగంలో గమనించిన మార్పులివే!

‘‘నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు, బాబీ చాలా ఉత్సాహపడ్డారు. ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఎంతో ఇష్టపడే నటుడు. హరి హర వీరమల్లులో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు. ఆయనతో కలిసి పని చేయడం చాలా గొప్ప అనుభవం’’ అని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను రూపొందించారనే విషయం తెలియంది కాదు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు జూలై 24న జస్టిఫికేషన్ జరుగుతుందని చిత్రబృందం చెబుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!