తెలంగాణ

Gadwal News: కొడుకులు అన్నం పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి

Gadwal News: నేటి సమాజంలో మానవ సంబంధాలు(Human relations) రోజు రోజుకి దిగజారుతున్నాయి. నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లారు కసాయి కొడుకులు. వృద్ధురాలైన కన్నతల్లిని, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి, అనాథగా వదిలేశారు కన్న కొడుకులు. ఉన్న ఆస్తి లాక్కొని, కన్నతల్లికి అన్నం పెట్టకుండా రోడ్డున వదిలేయడంతో జోగులాంబ గద్వాల(Jogulamba Gadhwala District) జిల్లా కలెక్టర్ కార్యాలయం మెట్లు ఎక్కిన ఘటన చోటుచేసుకుంది.

ఆ వృద్ధ మహిళ కన్నీరు

మల్దకల్ మండల కేంద్రానికి చెందిన పాపమ్మ(Papamma) (70)కు నలుగురు కుమారులు. కాగా పాపమ్మ భర్త చనిపోవడంతో నలుగురిలో ముగ్గురు అన్నదమ్ములు మంచిగా చూసుకుంటామన, నీ బాగోగులకు ఎలాంటి డోకా ఉండదని మాయమాటలు చెప్పి తన పేరిట ఉన్న 2.37 ఎకరాల భూమి(Land)ని గిఫ్ట్ డిడి కింద బలవంతంగా వారి భార్యలు, పిల్లల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారని ఆ వృద్ధ మహిళ కన్నీరు మున్నీరయ్యారు. అనంతరం అన్నం పెట్టకుండా ఇంటి నుంచి బయటకి పంపుతుండడంతో గ్రామంలో పెద్దలు పంచాయతీ చేయగా 50 వేలు ఇస్తామని కొడుకులు తెలపడంతో నాకు పైసలు వద్దు మీ ప్రేమతో బుక్క తిండి పెడితే చాలని వేడుకుంది.

Also Read: Badi Bata Program: మూతబడిన 26 స్కూళ్లు రీ ఓపెనింగ్‌.. బడి బాట సక్సెస్

ఇంటి నుంచి వెళ్ళమనడంతో

దీంతో నాలుగవ కుమారుడు స్పందించి చేరదీయగా సంవత్సరం పాటు ఆమెను చూసుకున్నాడు తాజాగా నాకు పొలం ఇవ్వడం లేదు నేను ఒక్కడినే బాధ్యతలు మోయాల అంటూ ఇంటి నుంచి వెళ్ళమనడంతో విధిలేక జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకుంది. నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, నా కుమారులు పట్టించుకోవడంలేదని, నా భూమిని తిరిగి నా పేరిట చేయాలని జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్(Collector Santhosh Kumar), అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు మొరపెట్టుకుంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని సంబంధిత ఆర్డిఓ(RDO) అధికారికి రిఫర్ చేశారు.

Also Read: Husband Killers: చంపడానికి ఉన్న ధైర్యం.. చెప్పడానికి లేదేంటి?

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!