Purna Wife Swapna
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Anchor Swetcha: తట్టుకోలేకపోతున్నా.. పచ్చి నిజాలు చెప్పిన పూర్ణచందర్ భార్య

Anchor Swetcha: ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య కేసు నాన్ స్టాప్‌గా సాగుతోంది. ఇప్పటి వరకూ స్వేచ్ఛ కుమార్తె, తల్లిదండ్రులు, బంధువులు మీడియా ముందుకొచ్చి సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే.. ఫస్ట్ టైమ్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పూర్ణచందర్ నాయక్ భార్య స్వప్న ఓ వీడియోలో పచ్చి నిజాలు బయటపెట్టింది. సోమవారం నాడు మీడియాకు స్వప్న వీడియో విడుదల చేశారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అయ్యింది. ‘ పూర్ణచందర్, స్వేచ్ఛ ఇద్దరూ స్నేహితులని మాత్రమే నాకు తెలుసు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ మాకు పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం నాకు తెలియదు. ఇద్దరి వ్యవహారం తెలిశాక డిప్రెషన్‌లోకి పోయి పూర్ణను వదిలేశాను. నా భర్తపై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అన్నీ అసత్యం. మా ఆయన మీద వేస్తున్న నిందలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడు. కంటిరెప్పలా చూసుకున్నాడు. స్వేచ్చ కూతురికి అలా చెప్పమని ఎవరు చెబుతున్నారో నాకు తెలియదు’ అని స్వప్న చెప్పింది.

Read Also- Anchor Swetcha: పూర్ణ చందర్‌ రిమాండ్‌లో సంచలనం.. బీఆర్ఎస్ కీలక నేత పేరు!

పదే పదే ఫోన్ చేసి..
నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్లాడు. మానసిక ప్రశాంతత కోసం అక్కడికెళ్లాను. అక్కడికి వెళ్లాక కూడా స్వేచ్ఛ పదే పదే ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్లుతున్నవ్..? ఆమె ఎవరని చెప్పి తీసుకెళ్లినవ్? అంటూ ఇబ్బంది పెట్టింది. ఆయన లిఫ్ట్ చేయకపోతే, నా నెంబరుకు ఫోన్ చేసి మరీ సతాయించింది. మేం ఎక్కడికి వెళ్లినా తను ఫోన్ చేసి ఆమెతో ఎందుకుంటున్నవ్? నా దగ్గరికి వచ్చేసేయ్? అంటూ బ్లాక్ మెయిల్ చేసింది. స్లీపింగ్ పిల్స్ మింగేది. నాకు కూడా ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురిని కూడా సొంత కూతురులాగే చూసుకున్నాడు. నా పిల్లలు చెప్పారు. అక్కడ ఒక ఆంటీ ఉందని.. అక్క దగ్గరికి వెళ్లి ఆడుకుంటున్నామని చెప్పారు. తనను అమ్మా అని పిలువమని స్వేచ్ఛ అని నా పిల్లలకు చెప్పిందని నా కూతురు చెప్పింది. ఇంత చేరదీసినా మీ మమ్మీ ఏం చేసింది? మమ్మల్ని రోడ్డుపాలు చేసేసింది. నా జీవితం ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? మళ్లీ చెబుతున్నా.. నా భర్త నిర్దోషి, అమాయకుడు. మా ఆయన అంత చెడ్డోడు కానే కాదు, న్యాయస్థానాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నిర్దోషి అయిన నా భర్తను ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని వీడియోలో స్వప్న పేర్కొన్నది.

Swapna

స్వేచ్ఛ కూతురు చెప్పిందేంటి?
స్వేచ్ఛ కూతురు అరణ్య మాత్రం పూర్ణపై సంచలన ఆరోపణలు చేసింది. ఆదివారం నాడు స్వేచ్ఛ-బిగ్ టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడింది. ‘ నాకు నాలుగేళ్లుగా పూర్ణ తెలుసు. అమ్మ ముందు నాపై ప్రేమ ఉన్నట్లుగా నటించేవాడు. నాతో చాలాసార్లు అసభ్యకరంగా ప్రవర్తించే వాడు. ఇవన్నీ అమ్మకు చెబితే నమ్మలేదు. పూర్ణను తండ్రిలా ఫీల్ అవ్వమని చెప్పేది. అమ్మ బాధపడకుండా ఉండాలని ఆయనతో క్లోజ్‌గా ఉన్నాను. నాకు పరీక్షలు ఉన్నాయని చెప్పినా నాతో పనులు చేయించేవాడు. పూర్ణచందర్‌తో మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఇలాగే ఇంకెన్ని రోజులు ఉండాలి? అని తరచు గొడవ పడుతూ ఉండేది. మూడేళ్లుగా మా అమ్మను వెంటాడుతూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నాపై కూడా అతడి ప్రవర్తన అసభ్యంగా ఉండేది. కష్టమైన రీతిలో శారీరకంగా హద్దులు దాటి ప్రవర్తించేవాడు. నేను ఎంతో మానసిక వేధన అనుభవించాను. పూర్ణచందర్ ఎప్పుడూ స్వేచ్ఛను తల్లి దగ్గరకు వెళ్లనివ్వకుండా అడ్డుపడేవాడు. దీంతో మా అమ్మమ్మ మానసికంగా బాగా కుంగిపోయింది. ఈ మధ్యనే పూర్ణ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు స్వేచ్ఛను ఆహ్వానించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ తర్వాతే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. తల్లి ఈ సంబంధాన్ని ఇకపై కొనసాగించనని స్పష్టంగా చెప్పింది. మా అమ్మ ఆత్మహత్యకు బాధ, వేదన కలిగించిన వ్యక్తి పూర్ణ. అతడిని మా అమ్మ చెప్పుతో, నా చెప్పుతో కొట్టాలి. ఆ తర్వాతే అతడ్ని ఉరి తీయాలి’ అని స్వేచ్ఛ కుమార్తె చెప్పింది.

Swetcha

కర్త, కర్మ.. క్రియ!
మరోవైపు స్వేచ్ఛ తండ్రి శంకర్ కూడా పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని.. తన మనవరాలిని సైతం వేధించాడని పేర్కొన్నారు. తల్లి స్వేచ్ఛతో కూడా కుమార్తె చెప్పుకోలేకపోయిందని చెప్పారు. ‘ నా కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణం. భర్తతో విడిపోయాక పూర్ణచంద్రరావుతో స్వేచ్ఛ ఉంటున్నది. స్వేచ్ఛ, పూర్ణచంద్రరావు మధ్య కొన్నాళ్లుగా విబేధాలు ఉన్నాయి. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాట ఇచ్చి ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయడంతో కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ విషయంలోనే నా కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలి’ అని స్వేచ్ఛ తండ్రి తెలిపారు. ఇదిలా ఉంటే.. స్వేచ్ఛ మృతికి తానే కారణమని పోలీసు విచారణలో పూర్ణ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తన వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని విచారణలో పూసగుచ్చినట్లుగా చెప్పేశాడు.

Read Also- Raja Singh: బీజేపీకి రాజాసింగ్ రాజీనామా.. లవ్ లెటర్ ఇచ్చి..

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు