Damodar Raja Narasimha: వైద్యారోగ్యశాఖను హై ప్రయారిటీ లిస్టు(High priority list)లోకి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సమస్యల పరిష్కారానికి ఇక నుంచి మరింత సీరియస్‌గా ఫోకస్ పెట్టనున్నారు. గ్రీన్ ఛానెల్‌లో సొల్యుషన్స్ లభించనున్నాయి. ఇప్పటికే స్టైఫండ్ హైక్(Stipend hike) చేసిన సర్కార్ ఇక నుంచి రెగ్యులర్‌గా పేమెంట్స్ అందేలా చొరవ తీసుకోనునున్నారు. ఇందుకోసం తాజాగా స్వయంగా హెల్త్ మినిస్టర్ గ్రీన్ ఛానల్‌లో రెగ్యులర్ నిధులు విడుదల చేయాలని ఆర్ధిక శాఖను కోరారు. ఇక మెడికల్ కాలేజీల్లో స్టాఫ్సమస్య రాకూడదని కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న స్టాఫ్‌ను ఏడాది పాటు రెన్యూవల్ చేశారు. ప్రోఫెసర్ల ప్రమోషన్లు పూర్తి చేసిన సర్కార్ ఇక నుంచి ఫ్యానల్ ఇయర్స్ మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ప్రమోషన్లు క్లియర్ కావాలని మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు.
హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో రివ్యూ
క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్స్ పెట్టుకొని, సమస్యలు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోనున్నారు. స్టాఫ్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌ను ఎప్పటికప్పుడు అవసరాలకు దగ్గట్టుగా కల్పించనున్నారు. ఇందుకోసం వైద్య శాఖలోని వివిధ విభాగాల హెచ్‌వోడీల ఆధ్వర్యంలో ప్రతి నెల ఫర్మామెన్స్, సమస్యల జాబితాను తయారు చేయనున్నారు. నేరుగా హెల్త్ మినిస్టర్ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించి, సమస్యలకు చెక్ పెట్టనున్నారు. ఎమర్జెన్సీ శాఖ లిస్టులో ఉన్న వైద్యశాఖలోని సమస్యలను అత్యవసరంగానే తీర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు, డాక్టర్ల సమస్యలు, ఉద్యోగుల పెండింగ్ వర్క్స్‌ను క్లియర్ చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.
మెడికల్ కాలేజీలపై పుల్ ఫోకస్
తెలంగాణలో 2021 సంవత్సరం నాటికి కేవలం 9 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం 2022లో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు(Medical college), 2023లో 9 కాలేజీలు ఏర్పాటు చేసింది. 2024లో మరో 8 కాలేజీల ఏర్పాటుకు జీవో(GO)లు ఇచ్చింది. అయితే ఒకేసారి ఎక్కువ కాలేజీలకు పర్మిషన్లు రావడం వలన ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకోవడంలో ఆరోగ్యశాఖకు సవాల్‌గా మారింది. కాలేజీ బిల్డింగులు, హాస్టల్ బిల్డింగులు, అనుబంధంగా హాస్పిటళ్లు లేకుండానే 2022, 2023లో ఏకంగా 17 కాలేజీలు ప్రారంభమయ్యాయి. కనీస వసతులు లేని అద్దె భవనాలు, గోదాములను కాలేజీలుగా ఎన్‌ఎంసీకి చూపించి, గత ప్రభుత్వం అనుమతులు తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీల సంఖ్య ఉన్నట్టుండి 9 నుంచి 34కు పెరగడంతో ఫాకల్టీ కొరత, మౌలిక వసతుల కొరత విపరీతంగా ఏర్పడింది.
Also Read: Badi Bata Program: మూతబడిన 26 స్కూళ్లు రీ ఓపెనింగ్.. బడి బాట సక్సెస్
కాస్త సమయం ఇవ్వాలి
నేషనల్ మెడికల్ కమిషన్(National Medical commission) కూడా గతంలో ఓ సారి నోటీసులు కూడా ఇచ్చింది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ జోక్యం చేసుకొని ఎన్ ఎంసీ చైర్మన్ తో హైదరాబాద్(Hyderabad) లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పరిస్థితిని స్పష్టంగా వివరించారు. ఎన్ ఎంసీ నామ్స్ ప్రకారం అన్ని కాలేజీల్లో సౌలత్‌లు కల్పిస్తామని, కానీ కాస్త సమయం ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన ఎన్ ఎంసీ వీలైనంత వేగంగా స్టాఫ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలని సూచించింది. ఈ సమస్యలను అధిగమించి కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లను అభివృద్ధి చేసుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళిబద్ధంగా ముందుకెళ్తున్నది. మెడికల్ కాలేజీ మానిటరింగ్ ఈ కమిటీలు అన్ని కాలేజీలను సందర్శించి అనేక అంశాలను పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తున్నాయి. దాని ప్రకారం యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు.
హాస్పిటళ్ల బలోపేతానికి చర్యలు: మంత్రి దామోదర రాజనర్సింహా
కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆయా కాలేజీలు, హాస్పిటళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కొత్త హాస్టల్స్‌తో పాటు కొత్త ఉస్మానియా హాస్పిటల్(Osmania Hospital) నిర్మాణం కోసం పది సంవత్సరాలుగా జూడాలు, ఫాకల్టీ పోరాటాలు చేశారు. దశాబ్ద కాలపు ఆకాంక్షను నెరవేరుస్తూ, గోషామహల్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే, ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీ(Gandhi Medical College) విద్యార్థుల కోసం సుమారు 127 కోట్ల రూపాయలతో, అత్యాధునిక వసతులతో హాస్టల్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నది. ఇలా అన్నిరకాలుగా డాక్టర్ల ఆకాంక్షలను గౌరవిస్తూ, వారి ఆశయాలను నెరవేర్చే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తోంది. పెండింగ్‌లో స్టైఫండ్ సమస్యను కూడా తీర్చినం. పేద ప్రజల కోసం సర్కార్ డాక్టర్లు బాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. వైద్యారోగ్యశాఖలోని ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.
Also Read: Srisailam Reservoir: శ్రీశైలంపై ముగిసిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే