TG Temples
తెలంగాణ

Temples: ఆలయాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Temples: ప్రభుత్వ శాఖల్లో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సోషల్ ఆడిట్ నిర్వహిస్తూ అక్రమాలు జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తుందనే విషయాన్ని చాటనున్నది. అయితే, ఈ మధ్య కాలంలో దేవాలయాలకు సమకూరుతున్న ఆదాయంలో అవకతవకలు జరుగుతున్నాయని, రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని ఫిర్యాదు ఎక్కువ వస్తుండటంతో ప్రభుత్వం సోషల్ ఆడిటింగ్‌కు శ్రీకారం చుట్టబోతున్నది. అంతేకాదు ధూప దీప నైవేథ్యం కోసం వచ్చిన దరఖాస్తులపై, ఆ నిధులు పక్కదారి పట్టకుండా తనిఖీలు చేపట్టనున్నారు. ఆ ఆడిట్‌ను సోషల్ ఆడిట్‌కు ప్రభుత్వం అప్పగించినట్లు సమాచారం.

పథకాల అమలు ఎలా ఉందో తెలుసుకునేందుకు

ప్రభుత్వ శాఖలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి ప్రభుత్వం సోషల్ ఆడిట్‌ను నిర్వహిస్తుంది. సోషల్ ఆడిట్ ప్రక్రియ గ్రామీణాభివృద్ధి (ఉపాధిహామీ), వెల్ఫేర్​, ఇతర శాఖల్లో నిధుల కేటాయింపు, వినియోగం, పథకాల అమలు తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి నిర్వహిస్తారు. అక్రమాలు జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఆయా శాఖల్లోని అధికారులపై చర్యలు తీసుకుంటారు. ఆశాఖలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగకుండా నిత్యం తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తరుణంలోనే రాష్ట్రంలోని దేవాలయాలకు సమకూరుతున్న ఆదాయ వ్యయాలు, నిధుల కేటాయింపు,స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ (ఎస్​డీఎఫ్​) కింద అభివృద్ధికి కేటాయించిన నిధులు, రికార్డుల నిర్వహణ తీరు, ధూప దీప నైవేద్యం పథకం అమలులో కొన్ని నిధులు పక్కదారి పడుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం ఆలయాలపై దృష్టిసారించి సోషల్​ ఆడిట్ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రూరల్​ డెవలప్‌​మెంట్‌లోని సోషల్​ ఆడిటింగ్​ విభాగానికి తనిఖీ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సోషల్​ ఆడిటింగ్​ ప్రతినిధులతో దేవాదాయశాఖ అధికారులు చర్చించారు. ఇప్పటికే దేవాదాయశాఖ నుంచి కూడా ప్రపోజల్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వం సోషల్ ఆడిటింగ్​ ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ చేపడితే రాష్ట్రంలోని పలు ఆలయాల్లో జరిగిన అక్రమాలు వెలుగులోకి రానున్నాయి.

ప్రతినెలా ప్రభుత్వం రూ.6.54 కోట్లు మంజూరు

రాష్ట్రంలో మొత్తం 6,541 ఆలయాలు రికార్డుల్లోనే ఉన్నాయి. ఇందులో 5837 ఆలయాలు ధూప దీప నైవేద్య పథకం కింద కొనసాగుతున్నాయి. ఈ ఆలయాలకు ప్రతినెలా ప్రభుత్వం రూ.6.54 కోట్లు మంజూరు చేస్తుంది. తాజాగా మరో 250 ఆలయాలను ఈ పథకంలో ఎంపిక చేయనున్నారు. అందుకోసం 3300లకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. 250 ఆలయాలను ఎంపిక చేస్తే ప్రభుత్వానికి రూ.25 లక్షల వరకు అదనపు భారం పడనున్నది. అయితే, కొన్ని ఆలయాలకు అర్హత లేకున్నా ధూప దీప నైవేద్యం పథకం అమలు చేస్తున్నారని, ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకంలో చేర్చి నిధులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మరోవైపు డీడీఎన్​ పథకానికి వచ్చిన వచ్చిన ఆప్లికేషన్లు ఎన్ని? ఆలయాల్లో నిర్వహణ ఎలా ఉంది? ఆలయం ఉందా లేదా? నిత్య పూజలు చేస్తున్నారా? పూజారులు ఉన్నారా? అనే వివరాలు తెలుసుకునేందుకు సామాజిక తనిఖీకి శ్రీకారం చుడుతున్నారు.

Read Also- Viral News: ప్రియుడితో కలిసి.. భర్త కళ్లలో కారం కొట్టి..

మెయింటెన్స్ తీరుపై సోషల్ ఆడిట్ అధికారుల తనిఖీ

తెలంగాణలో 704 ఆలయాలు ఈవోల పరిధిలో ఉన్నాయి. దేవాలయాలకు హుండీలు, దాతలు, ఆస్తుల రూపంలో ఆదాయం వస్తుంది. వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి పనులు, ఆలయ నిర్వహణ కోసం ఖర్చు చేస్తారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ (ఎస్​డీఎఫ్​) కింద ఆలయాల అభివృద్ధి పనులు సైతం చేపడతారు. అయితే, వచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలను, రికార్డుల మెయింటెన్స్ తీరుపై సోషల్ ఆడిట్ అధికారులు తనిఖీ చేయనున్నారు. గతంలో భక్తులకు ఇచ్చే దర్శన, ప్రత్యేక పూజల టిక్కెట్ల దందాపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిపైనా ఆడిట్​ చేయనున్నారు. భక్తులు, ఆలయ నిర్వాహకుల నుంచి సైతం అభిప్రాయాలు సేకరించనున్నట్లు సమాచారం. గతంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నకిలీ టిక్కెట్ల భాగోతం, పలు ఆలయాల్లో వీఐపీ టిక్కెట్ల లోనూ గోల్​మాల్​ జరిగిన సంఘటనలు ఉన్నాయి. దీంతో పకడ్బందీగా పక్కా ప్రణాళికలతో తనిఖీలు చేపట్టి అధికారులకు నివేదికను అందజేయనున్నారు.

పింఛన్‌లకూ సోషల్ ఆడిట్‌

మరోవైపు రాష్ట్రంలో చేయూత (ఆసరా) పింఛన్‌లకు సోషల్ ఆడిట్‌ను ప్రభుత్వం చేపడుతుందని అధికారులు తెలిపారు. పెన్షన్ల మంజూరు, పంపిణీలో అవకతవకలకు చెక్​ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొంతమంది వృద్దులు చనిపోయినా వారి పేరుపై పింఛన్లు కాజేస్తున్నారని, కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గతంలో కొన్ని వెలుగులోకి వచ్చాయి. అనర్హులను తొలగించి అర్హులైనవారికే అందించేందుకే సోషల్ ఆడిట్​ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 42,08, 129 మంది పింఛన్​ తీసుకుంటున్నారు. ఇందులో 14,95,320 మంది వృద్ధులు, 15,09.793 మంది వితంతువులు పింఛన్లు తీసుకుంటున్నారు. మిగిలిన వారు డయాలసిస్, హెచ్ఐవీ, దివ్యాంగులు ఉన్నారు. అయితే, పింఛన్లు తీసుకుంటున్నవారిలో అనర్హులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే, నిజమైన లబ్ధిదారులు పింఛన్లు అందుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే అవకతవకలను అరికట్టి, పారదర్శకతను పెంపొందించేందుకు సోషల్​ ఆడిట్​ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సోషల్ ఆడిట్ కంప్లీట్ అయితేనే ఎంతమంది అనర్హులు తీసుకొంటున్నారనేదానిపై స్పష్టత రానుంది.

Read Also- Newton 4th law: ‘న్యూటన్ ఫోర్త్‌ లా’ ఇదేనట.. క్రేజీ పోస్ట్ వైరల్

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు