Kannappa Thanks Meet
ఎంటర్‌టైన్మెంట్

Kannappa Movie: ప్రభాస్ వచ్చినప్పుడు కాదు.. నా సీన్ నుంచే సినిమా లేచింది.. విష్ణు కామెంట్స్!

Kannappa Movie: అందరూ ప్రభాస్ (Prabhas) వచ్చిన తర్వాత సినిమా మారిందని అంటున్నారు కానీ.. అప్పుడు కాదు సినిమా మారింది. అంతకు ముందు నా సీన్ దగ్గర నుంచే సినిమా మారిందని అన్నారు మంచు విష్ణు. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం శుక్రవారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శనివారం థ్యాంక్యూ మీట్ (Kannappa Thanks Meet) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు (Manchu Vishnu) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ వచ్చినప్పటి నుంచి కాకుండా అంతకు ముందు సన్నివేశం నుంచే సినిమా ఊపందుకుందని, సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, చివరి గంటలో వచ్చే సినిమాతో ప్రేక్షకులు మమ్మల్ని క్షమించారని చెప్పుకొచ్చారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఇంకా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘అందరూ ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మారిందని అంటున్నారు కానీ, నేను వెళుతుంటే శరత్ కుమార్ పిలుస్తారు.. నేను ఆగిన తర్వాత మా ఇద్దరి మధ్య వచ్చే సంభాషణ దగ్గర.. అందరూ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ప్రభాస్‌కు ఉన్న స్టార్‌డమ్ కారణంగా అందరూ అతను ఎంట్రీ ఇచ్చినప్పుడని అనుకుంటున్నారు కానీ, అసలు సినిమాకు జనం కనెక్ట్ అయింది మాత్రం ఆ సన్నివేశం నుంచే. ఆ తర్వాత ప్రభాస్ దానిని ఇంకాస్త హైకి తీసుకెళ్లారు. రెమ్యునరేషన్ పరంగా ఇప్పటి వరకు ప్రభాస్‌కు నేనేం ఇవ్వలేదు. తర్వాత నేను ఏమి ఇస్తానో ఇప్పుడే చెప్పను. మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేమంతా ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’’ అని తెలిపారు.

Also Read- Naga Chaitanya: శోభిత, నేను ఆ రూల్స్ పెట్టుకున్నాం.. ఫస్ట్ టైమ్ పర్సనల్ మ్యాటర్ చెప్పిన చైతూ!

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) మాట్లాడుతూ.. ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం లభించింది. మా టైమ్‌లో ఓ సినిమాకు ఇన్ని సమావేశాలను పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులంతా నా వెన్నంటే ఉండి, నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘కన్నప్ప’ సక్సెస్ తర్వాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారంతా చూపిస్తున్న ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి వర్క్ చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆజ్ఞతో పాటు, అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఈ సినిమా ఇంత వరకు వచ్చింది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, మైత్రి శశి, వినయ్ మహేశ్వరి, అర్పిత్ రంకా, శివ బాలాజీ, కౌశల్ వంటి వారంతా మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ పట్ల తమ ఆనందాన్ని తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!