Chaitu and Sobhita
ఎంటర్‌టైన్మెంట్

Naga Chaitanya: శోభిత, నేను ఆ రూల్స్ పెట్టుకున్నాం.. ఫస్ట్ టైమ్ పర్సనల్ మ్యాటర్ చెప్పిన చైతూ!

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల (Sobhita Dhulipala) వివాహం తర్వాత అంత పెద్దగా మీడియాతో రియాక్ట్ కాలేదు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా వరకు కామ్‌గానే ఉంటూ వచ్చారు. ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చినా, కూల్‌గానే కనిపించారు. చైతూ, శోభితలు ప్రేమించుకుంటున్నారని, ఆ ప్రేమను పెద్దల వరకు తీసుకెళ్లి, వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారనే వార్తలే కానీ.. అసలు వారికి సంబంధించిన ఇతర విషయాలేవీ పెద్దగా ఎవరికీ తెలియదు. తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ఓ మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ చైతూ వారి పర్సనల్ విషయాల గురించి చెప్పడంతో.. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read- Samantha and Sreeleela: ‘ఊ అంటావా’ భామతో ‘కిస్సిక్’ పాప.. స్టన్నింగ్ అవతారాల్లో!

ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ.. ‘‘ప్రజంట్ మేమున్న వృత్తి రీత్యా మేమిద్దరం కలిసి ఎక్కువగా టైమ్‌ స్పెండ్‌ చేయడానికి వీలుపడదు. అందుకే క్వాలిటీ టైమ్‌ను స్పెండ్‌ చేయడానికి, మా అనుబంధాన్ని మరింత పెంచుకోవడానికి ఇద్దరం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. వాటిని కచ్చితంగా పాటిస్తాం. అవేంటంటే.. మేమిద్దరం హైదరాబాద్‌లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలి. సండే రోజు మాత్రం మేమిద్దరం మాకు నచ్చిన విధంగా ఉండాలి. ఆరోజు ఏదైనా మూవీ చూడటం, షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం లేదంటే కుక్‌ చేసుకోవడం.. ఇలా ఆ టైమ్‌ని మాకు ప్రత్యేకంగా, మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాం. శోభితకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. నాకేమో రేసింగ్‌ అంటే ఇష్టం. ఇద్దరం కలిసే హాలిడే ప్లాన్ చేస్తాం. రీసెంట్‌గా శోభితకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్‌ చేయడం నేర్పించాను. తను చాలా హ్యాపీగా ఫీలైంది. అంతే కాదు, ఆ క్షణాలను బాగా ఎంజాయ్‌ చేసిందని చైతూ చెప్పుకొచ్చారు. (Naga Chaitanya Interview)

రతన్‌ టాటా‌కు అభిమానిని:
హీరోని అయినప్పటికీ.. నేను కూడా కొందరు రియల్ లైఫ్ హీరోలని అభిమానిస్తుంటాను. అందులో రతన్ టాటా అంటే నాకు చాలా ఇష్టం. నా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా నేను బాగా ఇష్టపడే వ్యక్తి రతన్ టాటా. ఆయనంటే నాకెంతో గౌరవం. ఆయననే నాకు స్ఫూర్తి అన్నట్లుగా భావిస్తాను. అలాగే ఎలాన్ మస్క్ లైఫ్ జర్నీ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్‌ నోలాన్‌, టాలీవుడ్‌ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి అంటే కూడా నాకెంతో అభిమానం అని నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also Read- Siddharth: స్టేజ్‌పైనే కంటతడి పెట్టుకున్న హీరో సిద్ధార్థ్.. నన్ను ఏడిపిస్తున్నారంటూ..

‘జీవించు, జీవించనివ్వు’ అనేది నా నినాదం. 2025 నాకు చాలా బాగుంది. ‘తండేల్’ సక్సె‌స్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నటుడిగా ఆ సినిమా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇందులో నేను ఒక జాలరి పాత్రని పోషించాను. నిజమైన కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు రూపొందించారు. నేను ఇంతకు ముందు ఇలాంటిది ప్రయత్నించలేదు. ఈ చిత్రానికి వచ్చిన స్పందనలు నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఒక్క సినిమాలే కాకుండా.. నాకు సంబంధించిన ఇతర అంశాలు కూడా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాయి. కాబట్టి, ఇది నాకు గొప్ప సంవత్సరమే. నేను ఇంకా మంచి సంవత్సరం కోసం ఎదురు చూస్తున్నాను.. అని చైతూ తెలిపారు. ఇంకా ఎన్ని విషయాల గురించి ముఖ్యంగా రేసింగ్ గురించి ఎన్నో కొత్త విషయాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు