GHMC Commissioner (imagecredit:twitter)
తెలంగాణ

GHMC Commissioner: ఇక డిప్యూటీ కమిషనర్ల వంతు.. త్వరలో ఉత్తర్వులు

GHMC Commissioner: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC)లో అదనపు కమిషనర్ల సంఖ్యలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV,Karnan) పదవీ బాధ్యతలను స్వీకరించిన కేవలం 58 రోజుల్లోనే అదనపు కమిషనర్ల సంఖ్యను కుదిస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పదకొండు వరకున్న అదనపు కమిషనర్ల సంఖ్యను తొమ్మిదికి తగ్గించటంతో పాటు ఆ సంఖ్యను కూడా మున్ముందు ఆరుకు కుదించే దిశగా కమిషనర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతలోపు జీహెచ్ఎంసీ(GHMC)లో సర్కిళ్ల వారీగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్లలో చాలా మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు ఇన్ ఛార్జి డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే మున్సిపల్ శాఖ పలువురు స్పెషల్ గ్రేడ్ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించినా, వారికి తగిన పోస్టింగ్ ఇవ్వకపోవటంతో, వారిని జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్లుగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.

పౌరసేవల నిర్వహణ సర్కిళ్లలో

దాదాపు పది మందిని జీహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్లుగా నియమించేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఏ సర్కిల్ లో ఎవరు ఎప్పటి నుంచి ఇన్ ఛార్జి డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నారు? అన్న సమాచారాన్ని కమిషనర్ సేకరించి, వారికి కూడా స్థానచలనం కల్గించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జీహెచ్ఎంసీ చేపట్టే అభివృద్దితో పాటు ప్రజలకు అందించే పౌరసేవల నిర్వహణ సర్కిళ్లలో ఎంతో ఎఫెక్టుగా ఉన్నందున సమర్థులైన అధికారులను సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లుగా నియమించే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో నాలుగు జోన్లలో ఐఏఎస్ అధికారులు జోనల్ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరు సికిందరాబాద్(Secunderabad), చార్మినార్ జోన్(Charminar Zone) జోనల్ కమిషనర్లుగా నాన్ క్యాడర్ ఆఫీసర్లు జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురు జోనల్ కమిషనర్లకు ఇప్పట్లో స్థానచలనం కల్గించే అవకాశం లేనట్టు సమాచారం.

Also Read: Student Commits suicide: హోం వర్క్ చేయలేదని మందలించడంతో.. పురుగుల మందు తాగిన విద్యార్థి

వీరికి బదిలీలు లేవా?

జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో బర్త్(Birth), డెత్(Derth) సర్టిఫికెట్ల రిజిస్ట్రార్ విధులతో పాటు పారిశుద్ధ్య విధులను కూడా నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లకు బదిలీల్లేవా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సరం అడ్డదారుల్లో హోమ్ బర్త్, డెత్ పేరిట ఇష్టారాజ్యంగా బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మెడికల్ ఆఫీసర్లను వదిలేసి, ఉన్నతాధికారులు హెల్త్ అసిస్టెంట్లపై కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెల్సిందే. ఫలక్ నుమా, మలక్ పేట సర్కిళ్లలో అడ్డదారిలో సర్టిఫికెట్లు జారీ అయిన విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి, కమిషనర్ కు నివేదికలు సమర్పించటంతో హెల్త్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకున్న కమిషనర్, సర్టిఫికెట్లపై డిజిటల్ సంతకాలు చేసిన మెడికల్ ఆఫీసర్లపై చర్యలు మినహాయించారు. ఈ పరిణామం జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది.

అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు

కొన్ని సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్లు(Medical Officers) ఏళ్లుగా పాతుకుపోయి, బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీతో పాటు ట్రేడ్ లైసెన్స్, స్వీపర్ల జీతాల చెల్లింపు వంటి వాటిల్లో అక్రమాలకు పాల్పడుతున్నా, వారిపై చర్యలు తీసుకోవటం లేదని, కనీసం బదిలీలు కూడా చేయటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ అదనపు కమిషనర్ల సంఖ్యను కుదించిన కమిషనర్ ఇపుడు డిప్యూటీ కమిషనర్లకు స్థానచలనం కల్గించి, మున్సిపల్ శాఖ పదోన్నతులు కల్పించిన ఆఫీసర్లను జీహెచ్ఎంసీ(GHMC)లోని పలు సర్కిళ్లలో ఇన్ ఛార్జి డిప్యూటీ కమిషనర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి స్థానంలో నియమించాలని నిర్ణయించుకున్న కమిషనర్ కర్ణన్(RV.Karnan) మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లపై చర్యలు ఎపుడు చేపడుతారు? వారికెపుడు బదిలీలు చేస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కానీ సర్కిల్ కు బాస్ గా వ్యవహారించే డిప్యూటీ కమిషనర్ల బదిలీల తర్వాత మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లకు స్థానచలనం కల్గిస్తే జీహెచ్ఎంసీ ప్రక్షాళన కాస్త పౌర సేవల నిర్వహణపరంగా ప్రయోజనాత్మకంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Mango Farmers: మామిడి రైతులను ముంచిన వాతావరణం.. ధర రాక దిగులు

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు