PJR Flyover (imagecredit:twitter)
తెలంగాణ

PJR Flyover: నేటి నుంచి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లై ఓవర్

PJR Flyover: ఐటీ కారిడార్లో అత్యంత రద్దీ, ట్రాఫిక్‌‌తో ఉన్న ఔటర్ రింగ్(ORR) రోడ్డు నుండి కొండాపూర్(Konda Pur) రూట్‌లో ట్రా ‘ఫికర్’ కు నేటి నుంచి చెక్ పడనుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ రూట్ లో వాహానాలను మరింత వేగంగా ప్రయాణించేందుకు వీలుగా స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (SRDP) కింద జీహెచ్ఎంసీ(GHMC) ప్రతిపాదించి నిర్మించిన పీజేఆర్ ఫ్లై ఓవర్(PJR Flyover) (శిల్పా లేఔట్ ఫేజ్-2 (పీజేఆర్) ను నేడు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది.ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఈ ఫ్లై ఓవర్ ను ముఖ్యమంత్రి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది, ప్రయాణ సమయంతో పాటు వాహనదారులకు ఇంధనం కూడా ఆదా అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రానున్న 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని, అప్పటి వరకు పెరగనున్న ట్రాఫిక్ కు అనుగుణంగా ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. దీన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సర్వం సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు వివరాలు

ఈ ఫ్లైఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నిర్మించారు. సుమారు 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన థర్డ్ లెవెల్ ఫ్లై ఓవర్. కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్- 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికి పైన ఫేజ్- 2 ఫ్లైఓవర్ నిర్మించారు.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి 29 ఆస్తుల నుంచి స్థలాలను సేకరించారు. వీటిలో ప్రధాన కార్యాలయం మొత్తం ఆరు ఆస్తుల నుంచి స్థలాలను సేకరింగా, మిగిలిన 23 ఆస్తుల నుంచి స్థానిక సర్కిల్, జోనల్ అధికారులు స్థలాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం సేకరించిన మూడు ఆస్తుల సేకరణకు రూ.5.48 కోట్లు, మరో మూడు ఆస్తులకు రూ. 4.80 కోట్లను నష్టపరిహారంగా చెల్లించగా, మిగిలిన ఆస్తులకు జోనల్ లెవెల్ లోనే నష్టపరిహారాలను చెల్లించగా, మరో మూడు ఆస్తులకు ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.

Also Read: Kayadu Lohar: ‘పిక్కలు చూశావా.. భయ్యా’.. డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి!

డైలీ 50 వేల వాహానాల రాకపోకలు

పీజేఆర్ ఫ్లై ఓవర్ నిర్మించిన రూట్ లో డైలీ సుమారు 50 వేల వాహానాలు రాకపోకలు సాగించనున్నట్లు జీహెచ్ఎంసీ అంచనా వేసింది. ఈ రూట్ లో ఒక వాహానం ట్రాఫిక్ ను అధిగమించి ఫ్లై ఓవర్ నిర్మించిన 1.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సుమారు 12 నిమిషాల 25 సెకనుల సమయం పడుతుండగా, ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జర్నీ టైమ్ 2 నిమిషాల 25 సెకనులకు తగ్గుతుందని జీహెచ్ఎంసీ అధికారును చెలిపారు. కొండాపూర్, శిల్పా లే అవుట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ వేగంగా ముందుకు సాగే వీలు కల్గుతుందని తెలిపారు. అలాగే ఈ రూట్‌లో రాకపోకలు సాగించే వాహానాల ఫ్లోకు తరుచూ అడ్డంకులేర్పడుతుండటంతో రాకపోకలు సాగించే సుమారు 50 వేల వాహానాల్లో సుమారు 3 వేల 7 లీటర్ల ఇంధనం వృథా ఖర్చవుతుందని, ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఇంధనం కూడా ఆదా కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు రూ. వంద వేసుకున్నా, ఏటా రూ. 11 కోట్లు, నెలకు దాదాపు రూ.90 లక్షల వరకు ఇంధనం ఖర్చు కూడా ఆదా కానున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు లెక్కలేస్తున్నారు.

ఫ్లై ఓవర్ పై రయ్ రయ్

ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటూ అడుగడుగునా అడ్డంకులేర్పడుతూ మెల్లిగా సాగుతున్న ట్రాఫిక్ ఈ ఫ్లై ఓవర్ నేటి నుంచి అందుబాటులోకి వస్తుండటంతో ఇక వాహానాలు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి. అంతేగాక ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నుంచి కొండాపూర్(Kondapur), హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఈ ఫ్లై ఓవర్ చాలా ఉపయోగకరంగా మారనుంది. హైటెక్ సిటీ(Hitec City), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. కొండాపూర్ ప్రాంతం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్, అక్కడి నుండి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలీ వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలగనుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్(Hyderaba) మౌలిక సదుపాయాల అభివృద్ధి మరో అడుగు ముందుకు పడినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Swetcha Effect: 800 ఏళ్ల చరిత్ర చెరువును కాపాడిన స్వేచ్ఛ కథనం.. స్పందించిన గ్రామస్తులు!

 

Just In

01

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!