Illegal Sand Transportation: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయానికి అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ సాండ్ పాలసీని బేస్ చేసుకుని కొందరు దళారులు తెలంగాణ((Telangana) ప్రాంతం నుంచి ఆంధ్ర(AP) ప్రాంతానికి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా తో అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రానికి ఆనుకుని ఉన్న అశ్వారావుపేట, సత్తుపల్లి మండలాల బెల్ట్ పరిదిలోని ఇసుకను అక్రమంగా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. రోజు 10 లారీల ఇసుకను అక్రమంగా అశ్వరావుపేట, సత్తుపల్లి మండలాల నుంచి తరలిస్తూ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఫ్రీ సాండ్ పేరిట తెలంగాణ నుంచి ఆంధ్రకు తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గృహ నిర్మాణ వినియోగానికి అక్కడి కూటమి ప్రభుత్వం(AP Govt) ఉచితంగా ఇసుకను తరలించుకోవచ్చని పాలసీని తీసుకొచ్చింది. ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో టన్నుకు రూ.1200 చొప్పున అక్రమార్కులు వసూలు చేస్తూ ఆంధ్రాకు ఇసుకను తరలిస్తున్నారు. అంటే ఒక్కో లారీకి 35 టన్నులు అనుకున్న ఒక్కో రోజుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 4,20,000 ఆదాయానికి గండి పడుతుంది. ఆంధ్రా సరిహద్దుగా ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి ప్రాంతాల నుంచి భారీఎత్తున ఆంధ్రాకు ఇసుక సప్లై అవుతుంది. అశ్వరావుపేట, సత్తుపల్లి, దమ్మపేట మండలాల్లో విస్తృతంగా ఇసుక మాఫియా నడుస్తోంది.
Also Read: Nagarkurnool: సీఎం సొంతూరులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్ ఆదేశాలు
పట్టించుకోని మైనింగ్, తనిఖీల అధికారులు
తెలంగాణ రాష్ట్రం(Telangana) నుంచి ఆంధ్రప్రదేశ్(AP) సరిహద్దు ప్రాంతాలకు ఇసుక రవాణా విస్తృతంగా జరుగుతుంటే అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతుంటే తనిఖీలు చేయాల్సింది పోయి చూస్తుండి పోతున్నారని అశ్వరావుపేట, సత్తుపల్లి, దమ్మపేట మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల నుండి ఇసుక మాఫియా చెలరేగుతుంటే అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతుంటే తెలవకుండా ఉంటుందా తెలిసే “మామూలు” గానే అధికారులు వ్యవహరిస్తున్నారా? అంటూ ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.
Also Read: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!