Telangana Jobs ( Image Source: Twitter)
Viral, తెలంగాణ

Telangana Jobs: యువతకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగాలు..

Telangana Jobs: వైద్యారోగ్య శాఖలో మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల భర్తీ కోసం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 కాగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఈ పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర సమాచారం బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

గత 18 నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,000కి పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వంటి పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం మరో 6,000కి పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో ల్యాబ్ టెక్నీషియన్ 1,284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ 1,930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) 2,322 వంటి పోస్టులు ఉన్నాయి. అదనంగా, త్వరలో మెడికల్ కాలేజీల్లో సుమారు 1,300 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందని బోర్డు అధికారులు వెల్లడించారు.

Also Read: Singer Pravasthi: మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి.. జనాలను ఫూల్స్ చేయడమే టార్గెట్?

Just In

01

Kavithakka Update: కవితక్క అప్ డేట్ పేరుతో ఎక్స్లో కథనాలు.. టార్గెట్ గులాబీ నేతలు?

Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది

OTT Movies: ఓటీటీ లవర్స్ కి పండగే.. ఆ రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి.. చూసేందుకు మీరు సిద్ధమేనా?

Zelensky: భారత్‌పై ట్రంప్ విధించిన సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తొలిసారి స్పందన

Mahabubabad District: యువకుడి పై ఆత్మహత్యా యత్నం.. పట్టించుకోని అధికారులు