Star Actress: బాలీవుడ్ లో పెద్దగా పరిచయం అక్కర్లేని గ్లామరస్ బ్యూటీల్లో ఎల్నాజ్ నౌరోజీ (Elnaaz Norouzi) ఒకరు. అందం, అభినయం, నటన కలగలిసిన అతి కొద్దిమంది ఈ జనరేషన్ నటీమణుల్లో ఆమె ఒకరు. సోషల్ మీడియాలో సైతం అమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎల్నాజ్.. తన జీవితంలో జరిగిన ఒక నమ్మకద్రోహం గురించి పంచుకున్నారు. దానిని ఎప్పటికీ మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె మాటలు బాలీవుడ్ లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
లవరే విలన్!
గతంలో కాఫీ విత్ కరణ్ షోతో ప్రముఖలను ఇంటర్వ్యూ చేసిన కరణ్ జోహార్ (Karan Johar).. ఇటీవల ‘ది ట్రైటర్స్’ (The Traitor) పేరుతో ఓ రియాలిటీ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ షోలో పాల్గొన్న ఎల్నాజ్ కు నమ్మకద్రోహంపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఆశ్చర్యకర ఘటనను ఆమె పంచుకున్నారు. తాను నాలుగేళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ చేసినట్లు ఎల్నాజ్ తెలిపారు. ఆ సమయంలో తనతోపాటు తన బెస్ట్ ఫ్రెండ్ తోనూ అతడు ప్రేమాయణం నడిపినట్లు ఆమె చెప్పారు. వారిద్దరికి సంబంధించిన మెయిల్స్, మెసెజెస్, ఫొటోలు చూసి తాను షాక్ కు గురైనట్లు చెప్పారు. తన జీవితంలో జరిగిన అతిపెద్ద ద్రోహం ఇదేనని ఎల్నాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్నాజ్ గురించి ఇవి తెలుసా!
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జన్మించిన ఎల్నాజ్ నౌరోజీ.. జర్మనీలో పెరిగారు. 14 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టిన ఆమె 2018లో వచ్చిన పాకిస్థాన్ చిత్రం ‘మాన్ జావో నా’ (Maan Jao Na) నటిగా మారారు. పంజాబి చిత్రం ‘ఖిదో ఖుండి (Khido Khundi) మూవీతో భారత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె హిందీ, ఉర్దూ, పంజాబీ, జర్మన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, పర్షియన్ భాషల్లో మాట్లాగలదు. 2022లో వచ్చిన ‘లా లా లవ్’ మ్యూజిక్ ఆల్బమ్ లో ఆమె మెరిశారు. పంజాబీ మ్యూజిక్ సెన్సేషన్ గురు రంధావా ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే మ్యూజిక్ వీడియోలోనూ నటించింది.
Also Read: ACB Raids: ఆర్టీఏ ఆఫీసులపై ఏసీబీ మెరుపుదాడులు.. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు.. కారణమిదే!
ఆమె ఎలా ఫేమస్ అంటే!
అయితే ఎల్నాజ్ ను దేశమంతటికీ పరిచయం చేసింది మాత్రం నెట్‌ఫ్లిక్స్ ‘సేక్రడ్ గేమ్స్’ సిరీసే. ఆ తర్వాత జీ 5లో వచ్చిన అభయ్ సిరీస్ లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్’ జియోసినిమాలో ప్రసారం అవుతోంది. ‘జన గణ మన’ చిత్రంతో కోలీవుడ్ లోనూ ఆమె అడుగుపెట్టారు. 2023లో వచ్చిన ‘కాందహార్’ (Kandahar) చిత్రంతో హాలీవుడ్ లోనూ సత్తాచాటింది. ఇంగ్లీషులో ఆమె నటించిన ‘హోటర్ టెహ్రాన్’ త్వరలో విడుదల కానుంది.