MHSRB Releases Notifications( image credit: fixabay
తెలంగాణ

MHSRB Releases Notifications: స్పీచ్ పాథాలజిస్ట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ!

MHSRB Releases Notifications: వైద్యారోగ్యశాఖలో మరో రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల భర్తీ మొదలు కానున్నది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు  (Health Services Recruitment Board) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు పేర్కొన్నది. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని బోర్డు అధికారులు తెలిపారు.

 Also Read: Student Commits suicide: హోం వర్క్ చేయలేదని మందలించడంతో.. పురుగుల మందు తాగిన విద్యార్థి

వరుసబెట్టి ఉద్యోగాల భర్తీ

ఇక గత 17 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖానాల్లో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. మరోవైపు త్వరలో మెడికల్ కాలేజీల్లో దాదాపు 1300 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

దీని వలన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో (Govt Medical College) స్టాఫ్​ కొరత సమస్యకు చెక్ పడనున్నది. ఇటీవల అడిషనల్ డీఎంఈ పోస్టుల డీపీసీ కూడా పూర్తయింది. ప్రొఫెసర్ల ప్రమోషన్ల ప్రాసెస్ కూడా జరుగుతున్నది. ఆ తర్వాత అన్ని కాలేజీలకు పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్‌లు రానున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్వాలిటీ పెంచాలని సీఎం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) సీరియస్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. వరుసగా రివ్యూలు చేస్తూ ప్రమోషన్లు, నోటిఫికేషన్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ , స్టాఫ్​ సమస్యలకు చెక్ పెడుతున్నారు. అంతేగాక ట్రీట్మెంట్‌లో క్వాలిటీపై కూడా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు

Also ReadArvind Dharmapuri: కేసీఆర్ ఫ్యామిలీని గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి.. బీజేపీ ఎంపీ

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!