Golconda Bonalu: భాగ్యనగరం బోనాల జాతర శోభను సంతరించుకుంటుంది. చారిత్రాత్మకమైన గొల్కొండ(Golkonda) కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించటంతో జంట నగరాల్లో బోనాల జాతర హడావుడి మొదలైంది. స్థానిక కుమ్మర్ల ఆధ్వర్యంలో జరిగిన తొలి బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా మంత్రులు కొండా సురేఖ(Min Konda Surekha), హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar), శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar), బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)తో పాటు పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. వీరిలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇక ప్రతి సంవత్సరం మాదిరిగానే లంగర్ హౌజ్(Langar Houz) చౌరస్తా నుంచి భక్తులు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి తొట్టెలను సమర్పించారు. ఆ తర్వాత ఘటాల ఊరేగింపులు కూడా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఇక ప్రతి గురు, ఆదివారాల్లో గొల్కొండలో బోనాల జాతర జరగనుంది. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి తమ ముక్కులను చెల్లించుకుంటారు.
ఆదివారం లక్షల్లో భక్తులు
కొరిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రతి గురువారం వేలల్లో, అలాగే ప్రతి ఆదివారం లక్షల్లో భక్తులు గొల్కొండ బోనాల(Golkonda Bonalu) జాతరలో పాల్గొననున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా సర్కారు ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించాలంటూ తొలి బోనం సమర్పణకు హాజరైన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లు అధికారులను ఆదేశించారు. దీనికి తోడు వచ్చే నెల 13న జరగనున్న లష్కర్ లోని శ్రీ ఉజ్జయినీ మహాంకాళీ(Ujjaini Mahankali) అమ్మవారి బోనాల జాతర, రంగం, అంబారీపై ఊరేగింపులకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. దీంతో పాటు వచ్చే నెల 20న నగర వ్యాప్తంగా జరగనున్న హైదరాబాద్ బోనాల(Hyderabad Bonalu) జాతరలో భాగంగా లాల్ దర్వాజ సింహావాహిని అమ్మవారి దేవాలయం కూడా ముస్తాబవుతుంది. దీనికి తోడు మీరాలం మహాంకాళీ దేవాలయంతో పాటు కార్వాన్ లోని శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, హుమాయున్ నగర్ లోని శ్రీ కనకదుర్గ పోచమ్మ దేవాలయం, నాంపల్లి లోని శ్రీ ఎల్లమ్మ దేవాలయాలు బోనాల జాతరకు ముస్తాబవుతున్నాయి.
Also Read: Local Body elections: స్థానిక సంస్థల ఎన్నికలపై.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు
హాజరైన బీఎంఎస్ నేతలు
గోల్కొండ కోటలో వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మవారికి గురువారం జరిగిన తొలి బోనం సమర్పణ కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ(GHMC) ఎంప్లాయీస్ యూనియన్ నేతలు కూడా హాజరయ్యారు. భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ ఖైరతాబాద్ జోనల్ సెక్రెటరీ ఆర్ వెంకటేష్, యూనియన్ అధ్యక్షులు జి రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి టి కృష్ణ,అడిషనల్ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, సెక్రటరీ రూపేష్,నవీన్ లు అమ్మవారిని దర్శించుకుని, బోనం ఊరేగింపులో పాల్గొన్నారు.
ఎపుడు? ఎక్కడ?
26 నుంచి 29వ తేది వరకు నాలుగు రోజులపాటు బోనాల జాతర కొనసాగనుంది. దీంతోపాటు వచ్చేనెల 3వ తేది నుంచి 6వ తేది వరకు మరో నాలుగు రోజులపాటు గోల్కోండలో పూజలు చేయనున్నారు. దీంతోపాటు వచ్చేనెల 13న సికింద్రాబాద్(Secunderabad) ఉజ్జయినీ బోనాల ఉత్సవాలు ప్రారంభమై 17వ తేదిన ముగియనున్నాయి. హైదరాబాద్(Hyderabad) లాల్ దర్వాజ బోనాల ఉత్సవాలు ఈనెల 20వ తేదిన ప్రారంభమై 24వ తేదిన ముగించేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది.
సీఎంకు ఆహ్వానం
సికింద్రాబాద్ ఉజ్జయినీ బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఇటీవలే అందజేశారు.
Also Read: Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!