Manoj Manchu ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Manoj Manchu: తొలిసారి ‘కన్నప్ప’ కోసం అలాంటి పోస్ట్.. మనోజ్ పై నెటిజన్ల కామెంట్ల వర్షం

Manoj Manchu: గత కొంతకాలం నుంచి తమ్ముడు మంచు మనోజ్, అన్న మంచు విష్ణు మధ్య వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తన అన్న నటించిన కన్నప్ప గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

మనోజ్ ఎప్పుడూ ట్విట్టర్‌లో తన అన్నను (ఇప్పుడు X) విమర్శిస్తూ చేస్తూ ట్వీట్లు పెట్టేవాడు. మీడియా ముందు కూడా విష్ణుపై పలు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, విష్ణు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమాను కూడా కొన్ని సార్లు ట్రోల్ చేశాడు. అయితే, ఈ గొడవలను పక్కన పెట్టి, ‘కన్నప్ప’ మూవీ రిలీజ్ సందర్భంగా మనోజ్ స్పెషల్ పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పెట్టాడు. ఈ సినిమా జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Student Commits suicide: హోం వర్క్ చేయలేదని మందలించడంతో.. పురుగుల మందు తాగిన విద్యార్థి

మనోజ్ తన పోస్ట్‌లో ‘కన్నప్ప’ సినిమా నుంచి మోహన్ బాబు, మంచు విష్ణు పిల్లలైన అరి, వివి, అవ్రామ్‌ల ఫోటోలను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. ‘కన్నప్ప’ మూవీ యూనిట్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మూవీ కోసం మా నాన్న మోహన్ బాబు ఆయన టీమ్ ఎన్నో సంవత్సరాల నుంచి కష్ట పడ్డారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మా చిన్నారులు అరి, వివి, అవ్రామ్‌ల మధుర జ్ఞాపకాలను వెండి తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తనికెళ్ల భరణి గారి జీవితకాల కల ఈ సినిమా రూపంలో సాకారమై, శుక్రవారం రిలీజ్ అవ్వనుంది. మంచి మనసుతో సపోర్ట్ చేసిన ప్రభాస్ గారు , లెజెండరీ నటులైన మోహన్‌లాల్ గారు , అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవా గారు వంటి వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ చిత్రం కోసం వారు అందించిన సహాయం, చూపించిన ప్రేమ, నమ్మకం అమూల్యమైనవి. ఈ సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ‘కన్నప్ప’ ప్రయాణానికి పరమేశ్వరుడి ఆశీస్సులు, ప్రేమ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.” అంటూ పోస్ట్ చేశాడు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?