Nagarkurnool ( Image Source: Twitter)
తెలంగాణ

Nagarkurnool: సీఎం సొంతూరులో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. కలెక్టర్ ఆదేశాలు

Nagarkurnool: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు అయిన నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు తమ శాఖలకు నిర్దేశించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. మంజూరు అయిన పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలి. రోడ్ల విస్తరణ, బలోపేతంకు సంబంధించి పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలి. ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థల సేకరణతో పాటు అవసరమైన ప్రభుత్వ అనుమతుల ప్రతిపాదనలను వేగవంతం చేయాలి. కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల 100% నమోదు జరిగేలా కృషి చేయాలన్నారు.

Also Read: Kubera Movie: కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. గాయాలపాలైన ప్రేక్షకులు

పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు పనులను వేగంగా పూర్తి చేయాలి. పాఠశాల ఆవరణలోనే అదనంగా ఒక అంగన్‌వాడీ భవనాన్ని నిర్మించాలి. గ్రామంలో లైబ్రరీ, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ సేవలకు అవసరమైన భవనాల ఏర్పాట్లు తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించి, ప్రతి పనినీ నిర్దేశించిన సమయానికే పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలి. గ్రామంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలను వేగంగా పూర్తి చేయాలి. నూతనంగా నిర్మిస్తున్న పాల శీతలీకరణ కేంద్ర భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

Also Read: Lakshmi Narasimha Swamy Temple: మహిమాన్విత క్షేత్రం.. హేమాచల మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం!

ఆయన ఇంకా మాట్లాడుతూ విద్యుత్ లైన్లను భూమి లోపల నుండి ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో విద్యుత్ లైట్లకు సోలార్ విద్యుత్ అందించాలి. వీధి లైట్ల ఏర్పాటుకు అవసరమైన కరెంటు స్తంభాలను సిద్ధం చేయాలి. మిషన్ భగీరథ కార్యక్రమం కింద మంచి నీటి సరఫరాకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలి. తాగునీటి సరఫరా కోసం నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టాలి. రెడ్కో అధికారులు కొండారెడ్డిపల్లి గ్రామాన్ని వంద శాతం సోలార్ విద్యుత్ గ్రామంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

నాణ్యతతో పూర్తి చేయాలి..

ముఖ్యమంత్రి స్వగ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, అదనంగా చేపట్టిన పనులకు కావాల్సిన అనుమతులకు అవసరమైన మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గానికి గుర్తింపు వచ్చేలా కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులను కోరారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు