Karregutta Tourist Place: తెలంగాణ- చత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుటల్లో దాగి ఉన్న మావోయిస్టు అగ్రనేతల కోసం ఇటీవలనే పదివేల భద్రతా బలగాలతో 21 రోజులు కూంబింగ్ నిర్వహించింది. ఇందులో 31 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సంబంధిత అధికారులు వెల్లడించారు. మరికొంతమంది అగ్ర నేతలు ఇక్కడ నుంచి తప్పించుకున్నారు. భద్రతా బలగాల నిఘ లోపిస్తే మళ్లీ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం(Central Govt) కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. పర్యాటక రంగానికి(tourism sector) కావలసిన అన్ని రకాల హంగులు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. మావోయిస్టులకు స్వర్గధామంగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక రంగంతో అభివృద్ధి చేసి దేశంలోనే అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతంగా కర్రెగుట్టల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నో ఏళ్లుగా 1980 దశకంలో ఆదివాసీలు(Adivasis) స్థిర నివాసం కర్రెగుట్టల ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని జీవనం సాగించినట్లుగా పూర్వీకులు చెబుతున్నారు. కర్రెగుట్టల ప్రాంతం ఆదివాసీలు కిందకు దిగి కర్రెగుట్టల ప్రాంతంలో లాగానే స్థిరనివాసాన్ని ఏర్పరచుకొని ఆవాసం ఉంటున్నారు. ఇప్పటికీ ఈ ఆదివాసీలు అప్పుడు నిర్మించుకున్న ఆవాసాల్లోనే నివాసం ఉంటున్నట్లుగా సమాచారం. ఇటీవలనే మావోయిస్టులకు కేంద్ర భద్రతా బలగాలకు పెద్ద ఎత్తున ఎదుర్కొల్పులు, కూంబింగ్ లు నిర్వహించాయి.
పచ్చని చెట్లు, సెలయేళ్లు, పక్షుల కిలకిల కర్రెగుట్టల సొంతం
ఆదివాసీలకు అతి పురాతనం నుండి జీవనం కల్పించిన కర్రెగుట్టల ప్రాంతం. కొంతకాలం మావోయిస్టుల(Maoists)కు స్వర్గధామంగా మారింది. అయితే కర్రెగుట్టల ప్రాంతం అంత పచ్చటి ఎతైన చెట్లు, వాగుల సెలయేటి పరవళ్ళు, రకరకాల వైవిధ్య జాతి పక్షుల కిలకిల రావాలు కర్రెగుట్టల ప్రాంతంలో ఆహ్లాదాన్ని కల్పిస్తాయి. ఈ ప్రాంతాన్ని పర్యటక రంగంగా తీర్చిదిద్దితే మావోయిస్టుల బెడద లేకుండా పోతుంది. పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుందని కోణంలో కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఆహ్లాదకరమైన కర్రెగుట్టల ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపాదికన ప్రత్యేకమైన ప్రణాళికలను రచిస్తోంది.
Also Read: Hydraa Commissioner: ట్రాఫిక్ పోలీసులతో హైడ్రా ప్రత్యేక సమావేశం
వేసవిలో ఊటీ తరహా వాతావరణం
వేసవి సమయంలో రాష్ట్ర ప్రజలు ఆహ్లాదాన్ని కోరుకునే అతి ముఖ్యమైన ప్రాంతం ఊటీ తరహాలోనే కర్రెగుట్టల ప్రాంతంలోనూ అలాంటి వాతావరణం పర్యాటకులకు లభిస్తోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ ఉన్న భారీ సొరంగాలు, గుహలు, పొడవైన చెట్లు, రాతిగుట్టలు, పాలెం వాగు ప్రాజెక్టు పరవళ్ళు సందర్శకులను ఆహ్లాదంలో ముంచేత్తుతాయనే నేపథ్యంలో పర్యాటక రంగం(tourism sector)గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల కేంద్ర శాఖలతో సమన్వయంగా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది.
దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రంగా చేసేందుకు యోచన
భారత దేశంలో నే అతిపెద్ద సాయుధ భద్రతా బలగాల శిక్షణ కేంద్రం(Armed Security Forces Training Center) గా కర్రెగుట్టల ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్లు హోం మంత్రి అమిత్ షా(Amit Shah) యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ దాదాపు నాలుగు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులపై యుద్ధభేరి మోగించింది. ఏకంగా ఎన్ఐఏ(NIA) చీప్ తపన్ దేఖ సైతం ఇక్కడికి వచ్చి మావోయిస్టులను మట్టు పెట్టేందుకు ప్రణాళికలు రచించారు. అలాంటి సమయంలో కర్రే గుట్టల ప్రాంతం వద్ద స్థిరంగా అతిపెద్దదైన సాయుధ భద్రత బలగాల శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. చత్తీస్గడ్ రాష్ట్రం(Chhattisgarh) రాయపూర్ లో మావోయిస్టుల ప్రాబల్యం పై పోలీస్(Police) అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఆహ్లాదకరమైన ఊటీ
ఈ సమయంలో పోలీస్ ఉన్నతాధికారులతో కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దడంతోపాటు దేశంలోనే అతిపెద్ద సాయుధ బలగాల శిక్షణ కేంద్రం (Armed Security Forces Training Center)గా ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే ఇటు తెలంగాణ రాష్ట్రం(Telangana State) అటు చత్తీస్గడ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు ఆహ్లాదకరమైన ఊటీ లాంటి వాతావరణాన్ని అతి సులువుగా పొందొచ్చు. ఊటీ అంటే దూర భారంతో పాటు ఆర్థిక భారం ఉంటుంది. అదే కర్రెగుట్టల ప్రాంతంలో ఊటీ లాగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం చత్తీస్గడ్ రాష్ట్రాలకు ఆదాయంతో పాటు పర్యాటక రంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినట్లు అవుతుంది.
Also Read: Singer Pravasthi: మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి.. జనాలను ఫూల్స్ చేయడమే టార్గెట్?