Mahabubabad Tragedy: అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి… అతడు కావాలనుకుంటే కోట్లు కట్నం ఇచ్చే యువతిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆ యువకుడు అలా చేయకుండా అందరికీ అరదర్శంగా నిలిచాడు. ఆ ఆదర్శ లక్షణాలతోనే అనాధగా ఉన్నఓ యువతిని పెళ్లి చేసుకొని ఆమెకి జీవితాన్ని ఇచ్చాడు. ఇద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృత్యువు ప్రవీణ్ ను వెంటాడుతూ విద్యుత్ఘాతంతో కబలించింది. అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారం జూనియర్ లైన్మెన్ చిలుక ప్రవీణ్ గంగారం సబ్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పడిన వర్షానికి గంగారం మండలంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో కోమట్ల గూడెం కు వెళ్లే రహదారిలోని భగీరథ పంప్ హౌస్ వద్ద 11 కెవి ఇన్సులేటర్ పగిలిపోవడo తో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో మరమ్మత్తు చేసేందుకు అక్కడికి వెళ్ళాడు. సబ్ స్టేషన్ లో ఎల్ సి తీసుకొని విద్యుత్తు స్తంభం పైన కూర్చొని మరమతు చేస్తుండగా ఒకేసారి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ కాలుకు అంటుకుని స్తంభం పై నుండి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి మల్లయ్య, తల్లి గంగమ్మ
తండ్రి ఇటీవల కాలంలో మృతి చెందారు. కాలం పగబట్టింది కాబోలు ఆ కుటుంబాన్ని… ఒక్కొక్కరిని కబలిస్తూ అన్యోన్యంగా జీవిస్తున్న జంటను విడదీసింది. తన భార్య 9 నెలల గర్భవతి.. కడుపులో పెరుగుతున్న చిన్నారికి తండ్రి జాడ లేకుండా చేసింది. మృతుడు ప్రవీణ్ ది మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదుకుంట గ్రామానికి చెందినవాడు.
ప్రస్తుతం ప్రవీణ్ కొత్తగూడం మండల కేంద్రం గాంధీనగరం గ్రామంలో నివాసం ఉంటున్నారు. తన భర్త కోసం ఎదురుచూస్తున్న సౌమ్య కు మృతి చెందిన విషయం ఇంకా తెలియలేదు. ఆ విషయమే తెలిస్తే ఆదర్శ వివాహం చేసుకున్న ఆ యువతిలో అంతేలేని విషాద ఛాయలు అలముకునే పరిస్థితి నెలకొంది. తన భర్త ఫోన్ కలవడం లేదని.. సిబ్బందికి ఫోన్ చేస్తే ఎక్కడ సిగ్నల్ లేదని చెప్తున్నారు అని… బోరున విలపిస్తోంది. సౌమ్య కి తెలియకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్త పడుతున్నారని సమాచారం.