ఈ ఎంఈఎంయూ రైళ్లు, గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో, మరీ ముఖ్యంగా పండుగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయని స్పష్టం చేశారు. రూ.716 కోట్లతో కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, 2026 జనవరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2026 మే నుంచి ఉత్పత్తి ప్రారంభం కానున్నదని వివరించారు.
శుక్లాకు అభినందనలు
అంతరిక్ష ప్రయాణం చేస్తున్న భారతీయుడు శుభాన్షు శుక్లాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. 41 ఏండ్ల క్రితం రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న రెండో భారతీయుడిగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు చేస్తున్న ప్రయాణం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని కొనియాడారు. 14 రోజుల ప్రయాణం విజయవంతమై అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.