Gadwal Jurala Project: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. గత నాలుగు రోజుల నుండి జూరాల ఎగువన ఉన్న కర్ణాటకలోని (Karnataka)లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి దిగువనకు నీటిని వదలడంతో జూరాలకు (Jurala Project) వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. దీనికి తోడు కర్ణాటక పరిసరాలు ప్రాంతాలలో కృష్ణానదీ (Krishna River) పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు నదిలో కలుస్తోంది. దీంతో బుధవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు (Jurala Project) దగ్గర 13 గేట్ల ఎత్తివేసి దిగివకు నీటిని విడుదల చేస్తున్నారు.
Also Read: Mango Farmers: మామిడి రైతులను ముంచిన వాతావరణం.. ధర రాక దిగులు
జూరాల డ్యాం (Jurala Project) దగ్గర 317.690 లెవెల్ నీటిని నిల్వ ఉంచుకొని 51,779 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project) వైపు వదులుతున్నారు. సాయంత్రానికి (Jurala Project) జూరాల డ్యాం కు 92,000 క్యూసెక్కుల ఇన్ ప్లో నమోదు కాగ, ఔట్ ప్లో 85,805 క్యూసెక్కుల నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగాను ప్రస్తుతం 317.690 మీటర్లు నమోదైంది. దీంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి 32,169, కుడి ఎడమ కాలువలకు 848, భీమా-లిప్టు -1కు 650, కోయిల్‌సాగర్ (Koilsagar) కు 315క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు వరద ప్రవాహం పెరుగుతుండడంతో నదీ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: Software Employee Arrest: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లక్షల జీతం వదిలి డ్రగ్స్ దందా!