Dokka Seethamma: ‘అన్నమో రామచంద్రా’ అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు ‘డొక్కా సీతమ్మ’. ఆకలి అని వచ్చిన వారందరికీ లేదని అనకుండా అన్నదానంచేసి, విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి. కానీ ఎంత మంది భారతీయులకు ఆమె పేరు తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ అనే వాడు లేకపోతే.. ఈ పేరు ఎప్పటికీ వినిపించేది కాదు. ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చిన మదర్ థెరీసా అందరికీ తెలుసు కానీ, మన పక్కనే ఉండి.. ఎంతో మంది ఆకలి తీర్చిన ‘డొక్కా సీతమ్మ’ ఎవరికీ తెలియకపోవడం విడ్డూరం. ఆమె సేవను గుర్తించి కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మను పొగిడి.. సన్మానం చేయడానికి లండన్‌కు ఆహ్వానిస్తే సున్నితంగా ఆమె తిరస్కరించారు. కారణం, ఆమె లండన్ వెళితే.. ఇక్కడ ఎందరో ఆకలితో బాధపడతారనే వెళ్లలేదంటే, ఆమె గొప్పతనం ఏమిటో అర్థమై ఉండాలి. అలాంటి సీతమ్మను ప్రపంచానికి తెలిసేలా చేసిన ఘనత మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌దే. ఇప్పుడామె సేవలను ప్రపంచానికి తెలిసేలా.. వెండితెరపైకి తీసుకువస్తున్నారు ఉషారాణి మూవీస్ బ్యానర్ నిర్మాతలు వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్. టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ (Andhrula Annapurna Dokka Seethamma). తాజాగా మురళీ మోహన్ (Murali Mohan) పుట్టినరోజును పురస్కరించుకుని ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్, గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Also Read- NBK: పెద్దల్లుడితో హ్యాపీనే.. చిన్నల్లుడితోనే ప్రాబ్లమ్! బాలయ్య సంచలన వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు నా పుట్టిన రోజుని ఆశ్రమాల్లో జరుపుకుంటూ ఉంటాను. ఈసారి అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీమ్ నన్ను పిలిచారు. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ వేడుకకు గెస్ట్‌లుగా వచ్చిన రేలంగితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. ‘డొక్కా సీతమ్మ’పై సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మను పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే ఆమె వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ నిరాకరించారు. ఈ విషయం చాలా మందికి తెలియను కూడా తెలియదు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ ఇలా ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలని కోరారు.
Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!
దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ.. నా మొదటి హీరో మురళీ మోహన్ సార్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను చేయాలని ఆయనకు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో కథలు కథలుగా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో నాకు ఎంతగానో ఆనందంగా అనిపించింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ మురళీ మోహన్ నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దాసన్న, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, శివనాగు, లయన్ సాయి వెంకట్, నిర్మాత రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్ వంటి వారంతా ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
