Preity Mukhundhan
ఎంటర్‌టైన్మెంట్

Preity Mukhundhan: ‘కన్నప్ప’లో హీరోయిన్ ఉందా? ఉంటే ఎ.. క.. డ?

Preity Mukhundhan: ‘కన్నప్ప’ (Kannappa)లో హీరోయిన్ ఉందా? ఉంటే ఎక్కడుంది? ఇప్పుడిదే అనుమానాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు. మంచు హీరో విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా జూలై 27న విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు చాలా వేడుకలు నిర్వహించారు. కానీ, ఏ వేడుకలో హీరోయిన్ (Kannappa Heroine) కనిపించలేదు. దీంతో మంచు హీరోల డామినేషన్ ఇలా ఉంటుందనే.. వారి సినిమాలలో నటించడానికి హీరోయిన్లు వెనుకడుగు వేస్తుంటారనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టాపిక్‌తో ప్రస్తుతం మంచు హీరోలపై చిన్నపాటి ట్రోలింగే నడుస్తోంది.

అయినా మంచు ఫ్యామిలీకి ట్రోలింగ్ ఏం కొత్తకాదు అని అంటారా? అయితే ఓకే. ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన హీరోయిన్ ఒక్కసారి కూడా స్టేజ్‌పై కనిపించకపోతే.. ఇలాంటి డౌట్సే వస్తుంటాయి. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్‌లోనే ఓ హీరోయిన్ ‘టాటా బైబై’ చెప్పేసి వెళ్లిపోయింది. కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ మొదటగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. కొంతమేర షూటింగ్ పూర్తయిన తర్వాత, మరి ఏం జరిగిందో ఏమో? తెలియదు కానీ, ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు మోడల్ ప్రీతి ముకుందన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. ఫైనల్ వరకు ప్రీతి ఉండి.. సినిమా అంతా పూర్తి చేసింది. ఇటీవల వచ్చిన ట్రైలర్‌లో కూడా ఆమె గ్లామరే.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. సినిమా రిలీజ్ వేళ.. ప్రమోషన్స్‌లో మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు.

Also Read- Thammudu: ‘జై బగళాముఖీ..’.. ఇక అమ్మవారి దేవాలయాల్లో మోత మోగాల్సిందే!

ఏ ఏరియాకు పోయినా ఆ ఏరియాకు చెందిన యాక్టర్ ఇందులో ఉన్నారు. వారు చాలు అని అనుకున్నారా? ఆమెకు అంత సీన్ లేదని భావించారా? అందుకే దూరం పెట్టారా? అని రకరకాల అనుమానాలు ఈ విషయంలో వ్యక్తమవుతుండటం విశేషం. ఆఖరికి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఈ ముద్దు గుమ్మ దర్శనమివ్వకపోవడంతో ఈ అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. అసలే మంచు ఫ్యామిలీ హీరోలపై ఎప్పుడూ నెగిటివ్ వార్తలు పడుతుంటాయి. ఇలాంటివి కూడా తోడైతే.. ముందు ముందు వారి సినిమాలలో నటించడానికి ఎవరూ రాను కూడా రారు. ఈ విషయంలో ఆ ఫ్యామిలీ కాస్త శ్రద్ధ పెట్టాల్సి ఉందంటూ.. ఆ ఫ్యామిలీ అభిమానులు సూచనలు చేస్తున్నారు.

Also Read- NBK: పెద్దల్లుడితో హ్యాపీనే.. చిన్నల్లుడితోనే ప్రాబ్లమ్! బాలయ్య సంచలన వ్యాఖ్యలు

ఎందుకంటే, ఎంత మంది ప్రమోషన్స్‌కి వచ్చినా.. చిత్ర హీరోయిన్ ఈవెంట్స్‌లో కనబడితే వచ్చే కిక్కే వేరు. మరి దీనిని ‘కన్నప్ప’ టీమ్ ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు కనీసం ఓ ఇంటర్వ్యూ కూడా ఆమె నుంచి ఏర్పాటు చేయలేదు. ఇలా చేస్తే రాంగ్‌గానే సంకేతాలు వెళతాయి కదా. మేము చాలా స్ట్రిక్ట్ అని చెప్పుకోవడం కాదు.. ఇవాళ అన్నీ ప్రేక్షకులు గమనిస్తున్నారు. ఏ లోటు కనిపించినా, ఇట్టే పట్టేస్తున్నారు. ఏ ఈవెంట్‌కి వెళ్లినా ప్రభాస్ భజన తప్పితే.. సినిమా గురించి కూడా మాట్లాడడం మానేశారు. ఇలా అయితే ఇంకెప్పుడు మీకు గుర్తింపు వచ్చేది. ఇక ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటే.. సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ ఎలా నిర్వహించారో ఇండస్ట్రీ అంతా గుర్తు పెట్టుకోవాలి. హీరోయిన్లు ఇద్దరూ ఎలా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారో.. ఎలా సినిమాపై హైప్ తీసుకువచ్చారో.. కళ్ల ముందే కనిపిస్తున్నా.. ఫాలో అవ్వరా! ఇక మీరు మారరా? అంటూ ఒకటే కామెంట్స్. మరి ఈ కామెంట్స్‌పై మంచు ఫ్యామిలీ హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..