Thammudu Movie Still
ఎంటర్‌టైన్మెంట్

Thammudu: ‘జై బగళాముఖీ..’.. ఇక అమ్మవారి దేవాలయాల్లో మోత మోగాల్సిందే!

Thammudu: యంగ్ హీరో నితిన్ (Hero Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మూవీ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందులోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC Banner) నిర్మాణంలో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మాములుగానే క్రేజ్ మొదలైంది. అలాగే ‘వకీల్ సాబ్’ దర్శకుడు శ్రీరామ్ వేణు (Sriram Venu) చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. సీనియర్ నటి లయ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించారు. జూలై 4న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రస్తుతం టీమ్ యమా జోరుగా నిర్వహిస్తుంది. రోజూ ఏదో అప్డేట్ అన్నట్లుగా చిత్రబృందం ప్లాన్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘జై బగళాముఖీ’ (Jai Bagalaamukhii Song) అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- NBK: పెద్దల్లుడితో హ్యాపీనే.. చిన్నల్లుడితోనే ప్రాబ్లమ్! బాలయ్య సంచలన వ్యాఖ్యలు

‘‘జై బగళాముఖీ.. జై శివనాయకీ
జై వనరూపిణీ.. జై జయకారిణీ..
విభ్రమ రూపిణి.. విభ్రమ కారిణి గగన ఛత్ర వింధ్యాచలవాసిని
వీర విహారిణి.. క్రుద్ర విదారిణి సర్వ జీవ సంరక్షిణి జననీ..
మాం పాహి.. మా కాళీ.. మాతంగి.. మానేషి..’’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటలో ప్రతి పదంలో దైవత్వం ప్రతిజ్వలిస్తుంది. ఈ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్ లోకనాథ్ డివైన్ ట్యూన్‌తో అద్భుతంగా కంపోజ్ చేశారు. సింగర్ అబీ వీ ఆకట్టుకునేలా ఆలపించారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా ఈ ‘జై బగళాముఖీ..’ పాటను చిత్రీకరించినట్లుగా ఈ లిరికల్ వీడియో సాంగ్ చూస్తుంటే తెలుస్తుంది.

Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!

అమ్మవారికి బోనాలు తీసుకెళ్లేటప్పుడు ఎలా అయితే అలంకరిస్తారో.. అలా అన్ని అలంకరించి నటి లయ నడిచొస్తుండటం చూస్తుంటే.. ఇకపై అమ్మవారి దేవాలయాలలో ఈ పాట మోత మోగిపోవడం తధ్యం అనేది అర్థమవుతోంది. ఇప్పటి వరకు చాలా పాటలు ఇలాంటివి వచ్చాయి కానీ, ఇది వేరే లెవల్ అన్నట్లుగా అజనీష్ లోకనాథ్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లో ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్‌కు కూడా మంచి హిట్ కావాలి. ఆయన నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ మూవీ హిట్ కాలేదు. దీంతో ఆయన కెరీర్ అనుమానాల్లో పడింది. ఆ అనుమానాలకు తెరదించుతూ.. ఈ మూవీతో నితిన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?