Mega Brothers: మెగాబ్రదర్స్ మాతృమూర్తి కొణిదెల అంజనాదేవికి ఏమైంది? ఆమె ఆరోగ్యంపై ఎలాంటి అప్డేట్ ఎందుకు రాలేదు? అటు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా షూటింగ్ హుటాహుటిన ఇంటికి రాగా.. ఇటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీకి వెళ్లి హఠాత్తుగా బయటికి వచ్చిన పరిస్థితి. దీంతో తమ అభిమాన నటుడు.. అభిమాన నేత తల్లికి ఏమైందని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, సినీ ప్రియులు ఒకింత టెన్షన్ పడుతున్న పరిస్థితి. ఎవరూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై కీలక అప్డేట్ వచ్చింది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ‘ అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరూ నమ్మొద్దు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు కాసింత ఊపిరిపీల్చుకున్నారు.
Read Also- Anjana Devi: తల్లి అంజనా దేవికి అనారోగ్యం.. హుటాహుటిన వెళ్లిన పవన్
ఏమై ఉండొచ్చు?
కాగా, ఇవాళ ఉదయం అంజనాదేవి (Konidela Anjanadevi) అస్వస్థతకు గురయ్యారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్.. ఏపీ కేబినెట్ సమావేశంలో నుంచి మధ్యలోనే వదిలి, హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు. ఉదయం 11 గంటల నుంచి ఇదంతా జరుగుతున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మెగా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందిన పరిస్థితి. వాస్తవానికి గతంలోనే ఇలాంటి ప్రచారం జరిగినప్పటికీ.. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని చిరంజీవి పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఈసారి కూడా అదే విధంగా క్లారిటీ వస్తుందా? లేదా?.. ఈ వార్త అయితే రూమర్‌కే పరిమితం కావాలని అభిమానులు కోరుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె అస్వస్థతకు గల కారణాలు స్పష్టంగా తెలియట్లేదు. అంజనాదేవి వయసు 81 ఏళ్లు కావడంతో వయో సంబంధిత సమస్యలు అయి ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నది.
పవన్ ఎందుకొచ్చినట్లు?
ఒకవేళ అంజనాదేవి ఆరోగ్యంగా ఉన్నారని నాగబాబు (Nagababu) చెబుతున్న మాట నిజమే అయితే.. పవన్ హుటాహుటిన, అందులోనూ కేబినెట్ సమావేశం మధ్యలో నుంచే అమరావతి నుంచి హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సిన అవసరం ఏముంది? పోనీ.. ఆయనకు ఎవరైనా సమాచారం తప్పుగా చెప్పారా? అదే నిజమైతే సేనాని క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. చిరు, పవన్ ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో నుంచి హుటాహుటిన రావడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నాగబాబు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు నాలుగు గంటలే క్రితమే తన ట్విట్టర్ వేదికగా ఉపాసన కొణిదెల (Upasana Konidela) కూడా అత్త సురేఖ, బామ్మ అంజనాదేవీ, భర్త రామ్‌చరణ్‌లతో కలిసి మామిడికాయ పచ్చడి చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అంతేకాదు.. సురేఖ, అంజనాదేవి ఇద్దరూ కూర్చొని ఆవకాయతో భోజనం చేస్తున్నట్లుగా కూడా వీడియోలో క్లారిటీగా ఉన్నది. అటు నాగబాబు.. ఇటు ప్రసన్న క్లారిటీ ఇవ్వడంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా హ్యాపీ, లవ్ సింబల్స్‌తో అభిమానులు కామెంట్స్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది.
There is some inaccurate information being circulated,but she is absolutely fine.— Naga Babu Konidela (@NagaBabuOffl) June 24, 2025