Samantha and Raj Nidimoru: స్టార్ రోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత నుంచి సమంత కెరీర్ డౌన్ అయిందనే చెప్పుకోవాలి. ఆరోగ్య సమస్యలతో చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు స్టార్ హోదా ఉండేది. కానీ, ఇప్పుడు మాత్రం చేతిలో ఒక్క మంచి సినిమా కూడా లేదు. ఇక కొద్దీ రోజుల క్రితం ‘శుభం’ సినిమాతో నిర్మాతగా మారి మన ముందుకు వచ్చింది. నిర్మాతగా మారిన సామ్ తన అదృష్టాన్ని ‘శుభం'(Shubham) మూవీతో పరీక్షించుకుంది. ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకెళ్లింది. ఇక ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రిమ్ అవుతోంది.
సమంత(Samantha) ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్'(Rakth Brahmand) చేస్తుంది. అయితే, నటిగా సమంతకు అన్ని కష్టాలే ఎదురవ్వనున్నాయి. ఎందుకంటే, సామ్ పరిస్థితి అలా ఉంది. చైతూకి 2021లో విడాకులు ఇచ్చిన సామ్.. మయోసైటిస్ అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
ఆ సిరీస్ ఆగిపోనుందా?
ప్రస్తుతం, సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ లో నటిస్తోంది. ఇప్పుడు అది కూడా ఆగిపోయేలా ఉందని టాక్ నడుస్తుంది. కొద్దీ రోజుల క్రితం
ఈ సిరీస్ లో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోట్ల రూపాయల స్కామ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. మరి, ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. షూటింగ్ 25 రోజులే జరిగింది కానీ, సగానికి సగం బడ్జెట్ అయిపోయిందని టాక్ నడుస్తుంది. దీంతో, ఈ సిరీస్ ఆపేశారని సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే జరిగితే సమంత సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది.
Also Read: Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?
సమంత సినిమాలకు గుడ్ బై?
అయితే, ఈ వెబ్ సిరీస్ కి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజ్-డీకే మాత్రం అలాంటి పొరపాట్లు ఏం జరగలేదని చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఆగిపోతే మాత్రం సమంత చేతిలో ఏ కొత్త సినిమాలు లేవు. అయితే, అప్పుడు సామ్ సినిమాలకు గుడ్ బై చెబుతుందా లేక డైరెక్టర్ రాజ్ కు కూడా గుడ్ బై చెబుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి, ఈ వార్తల పై రాజ్ రియాక్ట్ అవుతారో? లేదో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు