Ponnam Prabhakar: బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బీసీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. బీసీ బిల్లుకు రాజకీయ రంగు పులమడం సరికాదని ఆయన హితవు పలికారు.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లును చట్టం రూపంలో తీసుకొని గవర్నర్‌కు పంపించిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ నేత ఆర్. కృష్ణయ్య అంటే తమకు గౌరవమని, అయితే కవిత ట్రాప్‌లో పడొద్దని సూచించారు. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకుంటే బీసీ బిల్లుపై చర్చించేందుకు అందరం కలిసి వెళ్దామని ఆయన పిలుపునిచ్చారు.
“కేసీఆర్, దయ్యాలు ఢిల్లీకి రావొచ్చు”
బీసీలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ బలమైన సంకల్పంతో ఉన్నట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారనేది స్పష్టంగా ఉందని, తాము నిర్వహించిన కుల గణనలో ఈ లెక్కలు తేటతెల్లమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు కేసీఆర్ “ఆ పక్కన ఉన్న దయ్యాలు ఎవరైనా” ఢిల్లీలో ఫైట్ చేసేందుకు రావొచ్చని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు