Phone Tapping Case (IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

Phone Tapping Case: ప్రభాకర్ రావు ఎవరి కనుసన్నల్లో పనిచేసినట్టు!

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసులో (Phone Tapping Case) సిట్​ అధికారులు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు, వారి సన్నిహితుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్న దర్యాప్తు అధికారులు తాజాగా ఐఏఎస్​, ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన (Shantikumari) శాంతికుమారితో పాటు జనరల్​ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ (Raghunandan Rao) రఘునందన్ రావుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది తెలుసుకోవడానికి సిట్​ అధికారులు విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.

 Also Read: Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!

ఎందుకు ట్యాప్ చేశారు?

ఈ క్రమంలోనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ (Prabhakar Rao) ప్రభాకర్​ రావును ఐదుసార్లు ప్రశ్నించారు. అయితే, సుప్రీం కోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో విచారణకు వస్తున్న ప్రభాకర్ రావు (Prabhakar Rao) నోరు తెరవడం లేదు. మావోయిస్టు సానుభూతిపరులని చెప్పి వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు? దీని వెనక సూత్రధారులు ఎవరని ప్రశ్నిస్తే నేనం చేశానో అంతా పై అధికారులకు తెలుసని మాత్రమే సమాధానాలిచ్చారు. తప్పితే సూత్రధారుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.

సిట్​ అధికారులు శ్రీకారం

ఈ నేపథ్యంలో ప్రభాకర్​ రావు (Prabhakar Rao) తప్పించుకోవడానికి వీల్లేని విధంగా ఆధారాలు సేకరించే పనికి సిట్ (Sit)​ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన శాంతికుమారి (Shantikumari) నుంచి స్టేట్మెంట్​ తీసుకున్నారు. దీంట్లో ఎస్​ఐబీ రివ్యూ కమిటీ ప్యానల్‌ను తప్పుదోవ పట్టించినట్టు శాంతికుమారి (Shantikumari) చెప్పినట్టుగా తెలిసింది. మావోయిస్టు సానుభూతిపరులు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబీ ఫోన్​ నెంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చిందని తెలియచేసినట్టు సమాచారం. దీనిపై తాను అభ్యంతరం కూడా వ్యక్తం చేసినట్టుగా ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలిసింది. ఇక, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్​ రావు (Raghunandan Rao) కూడా తన స్టేట్మెంట్‌లో ఇవే విషయాలను చెప్పినట్టు సమాచారం.

సీఎం ఫోన్‌ను సైతం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్​ రెడ్డి, మేడ్చల్​ జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి తదితరుల ఫోన్లను కూడా ప్రణీత్​ రావు (Praneeth Rao) టీం ట్యాప్​ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. వరంగల్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ నాయకుడు బిళ్ల సుధీర్​ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్​ చేసినట్టుగా నిర్ధారించారు. ఈ క్రమంలో సుధీర్​ రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. మిగితా వారు కూడా సిట్​ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలంటూ సమాచారం అందించారు.

ట్యాపింగ్ బాధితులు అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకుని ఆ వివరాలను (Supreme Court) సుప్రీం కోర్టుకు అందజేయాలని సిట్ (Sit) అధికారులు నిర్ణయించారు. తద్వారా (Prabhakar Rao) ప్రభాకర్​ రావుకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణ తొలగిపోయేలా చేసి కస్టడీకి తీసుకుని విచారణ జరపాలని నిశ్చయించారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారం మరికొన్ని రోజుల్లో సంచలన మలుపులు తిరగడం ఖాయమని పోలీస్ (Police) వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

 Also Read: TG HC On Local Body Election: స్థానిక సంస్థల ఎన్నికలపై.. హైకోర్టులో విచారణ!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?