NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంట్లో ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ముఖ్యంగా చిన్నల్లుడితో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అందుకే పెద్దల్లుడిని మెచ్చుకుంటూ, చిన్నల్లుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడా? అని టైటిల్ చూడగానే అంతా అనుకోవడం సహజమే. ఈ మధ్య కాలంలో బాలయ్య చిన్న కుమార్తె, బాలయ్య సినిమా వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. సినిమా ఇండస్ట్రీపై ఆమె మక్కువ ఎక్కువ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ చేస్తున్న ‘అఖండ 2’ (Akhanda) చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వ్యామోహంలో పడి ఆమె ఏమైనా తన భర్తని దూరం పెడుతుందా? అందుకే వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? ఇలా రకరకాలుగా అనుమానాలు వస్తున్నాయి కదా. అయితే మీరనుకుంటున్నట్లుగా.. ఇక్కడ మ్యాటర్ అది కాదు. బాలయ్య తన కుమారుడిని ఎలా పెంచాడో తెలియదు కానీ, కుమార్తెల విషయంలో మాత్రం గోల్డ్ అని చెప్పుకోవచ్చు.
Also Read- Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!
ఇద్దరు కుమార్తెలు కూడా బాలయ్య పేరు నిలబెట్టేవారే కానీ, ఎక్కడా ఆయనని తలదించుకునే పని చేయరు. ఆ విషయం అందరికీ తెలుసు. నందమూరి వంశంలో ఆడబిడ్డల పవర్ అలాంటిది. మరి ఎందుకు.. చిన్న అల్లుడిని బాలయ్య అంతగా డౌన్ చేస్తున్నాడని అనుకుంటున్నారా? అల్లుడు డౌన్ అవకపోవడమే బాలయ్యకు ప్రాబ్లమ్. అర్థం కాలేదు కదా! అసలు విషయం ఏమిటంటే.. బాలయ్య చిన్న అల్లుడు శ్రీ భరత్ (Sri Bharat) చాలా హైటుగా ఉంటారు. ఆయనని చూడాలంటే తల పైకెత్తి చూడాలి. అంత హైట్ ఉంటారు. తాజాగా బాలయ్య తన బర్త్ డేని పురస్కరించుకుని, పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి అల్లుళ్లు ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరి అల్లుళ్లపై చేతులేసి నిలబడాలని.. పక్కన ఎవరో అంటుంటే, బాలయ్య షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు.
Also Read- Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?
చిన్న అల్లుడిని ఉద్దేశిస్తూ.. ‘నీ మీద చేయి వేయాలంటే నాకు ప్రాబ్లమ్.. పుష్ప (ఒక భుజం పైకి పెట్టి)లా తయారవుతా. ఇక్కడైతే (పెద్దల్లుడు నారా లోకేష్ (Nara Lokesh)ను ఉద్దేశిస్తూ) హ్యాపీ అంటూ లోకేష్ భుజంపై చేతులేశారు. తర్వాత ఇద్దరు అల్లుళ్లపై చేతులేసి దగ్గరకు తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్యకి చిన్నల్లుడి హైట్‌తోనే ప్రాబ్లమ్ అని ఒకరు, ‘బాలయ్యకు మంచి అదృష్టం ఇచ్చాడు దేవుడు – మంచి అల్లుళ్ళు దొరికారు. దిష్టి తీసుకోవాలి’ అని మరొకరు.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
నీ మీద చేయి వేయాలంటే ప్రాబ్లం పుష్ప లా అయిపోతా…
ఇక్కడ వేశా…
అల్లుళ్ళ తో నందమూరి బాలయ్య… pic.twitter.com/YdhtZuiez6— మన ప్రకాశం (@mana_Prakasam) June 22, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు