Local Body Elections (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు (Telangana Highcourt)లో విచారణ జరిగింది. పిటిషనర్లు, ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాదనలు అనంతరం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మరింత సమయం కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై 6 నెలల తర్వాత నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందో చెప్పాలని ఈ సందర్భంగా హైకోర్ట్ ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని అడిగింది. అయితే రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి కాలేదని.. ఎన్నికల నిర్వహణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అటు ఎలక్షన్ కమిషన్ సైతం 60 రోజుల సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Also Read: Suryapet Gang War: వామ్మో ఇదేం ఫైటింగ్ రా సామీ.. నడిరోడ్డుపై చచ్చేలా కొట్టుకున్న యువకులు!

మరోవైపు పిటిషనర్లు సైతం కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎన్నికలైనా పెట్టాలని లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించాలని కోరారు. పదవి కాలం పూర్తైన ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధన ఉందని.. కానీ ప్రభుత్వం దానిని పాటించలేదని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసింది.

Also Read This: Actor Sriram: సినీ ఇండస్ట్రీలో సంచలనం.. నటుడు శ్రీరామ్ అరెస్ట్

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?