Actor Sriram: కోలీవుడ్ నటుడు శ్రీరామ్ చిక్కుల్లో పడ్డారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆయన్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై (Chennai) లోని నుంగంబాక్కం పోలీసు స్టేషన్ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. 2 గంటలుగా నటుడు శ్రీరామ్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఆయనకు వైద్య పరీక్ష చేయించారు. శ్రీరామ్ నుంచి రక్త నమూనాలను సేకరించారు.
మాజీ AIADMK కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఇటీవల ప్రసాద్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. నటుడు శ్రీరామ్ పేరు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతో తాజాగా నటుడు శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమిళనాడు మీడియాలో కథనాలు వస్తున్నాయి. శ్రీరామ్ అరెస్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
Also Read: Suryapet Gang War: వామ్మో ఇదేం ఫైటింగ్ రా సామీ.. నడిరోడ్డుపై చచ్చేలా కొట్టుకున్న యువకులు!
తిరుపతికి చెందిన శ్రీరామ్.. ‘రోజా పూలు’ (తమిళంలో ‘రోజా కూటం’) సినిమాతో తెరంగేట్రం చేశారు. వాస్తవానికి అతడి పేరు శ్రీకాంత్ కాగా.. తెలుగులో ఆ పేరుతో ఓ ప్రముఖ నటుడు ఉండటంతో.. శ్రీరామ్ గా మార్చుకున్నారు. శ్రీరామ్ తెలుగులో చేసిన ‘ఒకరి ఒకరు’ చిత్రం.. తెలుగు యువతను అప్పట్లో ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు ఉర్రూతలూగించాయి. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ శ్రీరామ్ గుర్తింపు సంపాదించారు. దడ, రావణాసుర, నిప్పు, లై వంటి చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. ఆయన తాజాగా నటించిన ‘ఎర్రచీర’ విడుదలకు సిద్ధంగా ఉంది.