Trisha - Vijay (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Trisha – Vijay: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న విజయ్, త్రిష జంట.. పెళ్లి ఫిక్స్ అయినట్లేనా?

Trisha – Vijay: తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందంటూ కొన్ని రోజుల క్రితం భారీ ఎత్తున ప్రచారం జరిగింది. వారిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున టాక్ సైతం వినిపించింది. డేటింగ్ లో ఉంటూ ఎక్కడికైనా జంటగానే వెళ్తున్నారన్న గాసిప్స్ కూడా వినిపించాయి. అయితే  కొన్ని రోజులుగా వారిద్దరికి సంబంధించి పెద్దగా ఫొటోలు, అప్ డేట్స్ లేకపోవడంతో అంతా సైలెంట్ అయిపోయింది. కానీ, తాజాగా మళ్లీ వారిద్దరి గురించి చర్చ మెుదలైంది. హీరోయిన్ త్రిష పెట్టిన తాజా పోస్ట్.. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ను మరోమారు చర్చకు తీసుకువచ్చింది.

త్రిష ఆసక్తికర పోస్ట్
దళపతి విజయ్ ఆదివారం రోజున తన 51వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెట్టారు. ఈ క్రమంలోనే నటి త్రిష (Trisha Krishnan) సైతం పోస్ట్ పెట్టగా.. ప్రస్తుతం అది కొత్త చర్చకు దారి తీసింది. నటి త్రిష తన ఎక్స్ (Twitter) పోస్ట్ లో ‘హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్’ క్యాప్షన్ పెట్టి ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో విజయ్.. త్రిషకు చెందిన పెట్ డాగ్ ను ఎత్తుకొని కనిపించాడు. ఆమె విజయ్ పక్కనే కూర్చొని అతడి వైపు అప్యాయంగా చూస్తూ ఉంది.

త్రిష ఇంట్లో విజయ్!
త్రిష లేటెస్ట్ ఫొటోను గమనిస్తే.. అది ఆమె ఇంట్లో తీసిందని అర్థమవుతోంది. విజయ్ త్రిష ఇంటికి వెళ్లి.. ఆమె పెట్ డాగ్ తో ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో విజయ్ త్రిష ఇంటికి సైతం తరుచూ వెళ్తాన్నాడా? అన్న అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారన్న అనుమానాలను తాజా ఫోటో కన్ఫార్మ్ చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇద్దరి జంట చాలా బాగుందంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తన బెస్టెస్ట్ అని చెప్పడం ద్వారా విజయ్ తనకు ఎంత ముఖ్యమో ఆమె చెప్పకనే చెబుతున్నారని పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా వీరి పెళ్లి ఫిక్స్ అన్న సంకేతాలు ఇచ్చారని పేర్కొంటున్నారు.

Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. తప్పిన పెను ముప్పు!

ఇంకా పెళ్లి చేసుకోని త్రిష!
విజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన 1999లో సంగీతను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు సంజయ్, దివ్య ఉన్నారు. మరోవైపు త్రిష 40ఏళ్లు దాటినా ఇంకా వివాహం చేసుకోలేదు. గతంలో ఓ సారి పెళ్లి ఫిక్స్ అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో అది ఆగిపోయింది. విజయ్ సినిమాలకు వస్తే ప్రస్తుతం అతడు ‘జన నాయగణ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే అతడికి చివరి సినిమా అని చర్చ జరుగుతోంది. విజయ్ గత చిత్రం ది గోట్ లో త్రిష అతిథి పాత్రలో కనిపించడం గమనార్హం.

Also Read This: Gold Records High: యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ఇక కొనలేమా.. మిడిల్ క్లాస్‌కు కష్టమే!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్